Home > సినిమా > ట్విట్టర్లో ట్రెండవుతున్న ఆదిపురుష్.. బెస్ట్ విషెస్ చెప్పిన దేవేంద్ర ఫడ్నవిస్

ట్విట్టర్లో ట్రెండవుతున్న ఆదిపురుష్.. బెస్ట్ విషెస్ చెప్పిన దేవేంద్ర ఫడ్నవిస్

ట్విట్టర్లో ట్రెండవుతున్న ఆదిపురుష్.. బెస్ట్ విషెస్ చెప్పిన దేవేంద్ర ఫడ్నవిస్
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ డైరెక్షన్లో భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. మైథలాజికల్ మూవీగా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగానే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ప్రస్తుతం ఆదిపురుష్ మూవీ ట్విట్టర్ ట్రెండింగ్లో ఉంది.

ఆదిపురుష్ రిలీజ్ నేపథ్యంలో పలువురు ప్రముఖులు మూవీ యూనిట్ కు బెస్ట్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ ‘ఆదిపురుష్’ మూవీకి సంబంధించి ట్వీట్ చేశారు. ఈ చిత్రం భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘మర్యాద పురుషోత్తముడు ప్రభు శ్రీరామ్ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ చిత్రం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందరిపై ఆయన దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షింస్తున్నా. దర్శక నిర్మాతలకు, ఇతర చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్’ అంటూ ఫడ్నవిస్ ట్వీట్ చేశారు.

మైథలాజికల్ మూవీగా తెరకెక్కిన ఆదిపురుష్లో ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతీసనన్ సీతగా కనిపించనుంది. రావణాసురుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించాడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఆదిపురుష్ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా సంస్థ రిలీజ్ చేస్తోంది.

Updated : 15 Jun 2023 7:16 PM IST
Tags:    
Next Story
Share it
Top