బిజినెస్ మేన్ రీ రిలీజ్.. మహేష్ బర్త్ డే రోజు ఫాన్స్కు పండగే..
X
టాలీవుడ్లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది హీరోల చిత్రాలు రీ రిలీజై బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. తాజాగా ఈ లిస్టులో మహేష్ బాబు కూడా చేరనున్నాడు. ఆయన పుట్టిన రోజు నాడు ఓ సినిమా రీ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
దూకుడు’ బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ ‘బిజినెస్ మేన్’. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘ఆర్.ఆర్ మూవీ మేకర్స్’ బ్యానర్ పై ఆర్.ఆర్.వెంకట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మహేష్ కు జోడీగా కాజల్ అగర్వాల్ అలరించింది. మహేష్ బాబు డిఫరెంట్ రోల్ ప్లే చేసిన ఈ 2012 జనవరి 13న రిలీజై ఘన విజయం సాధించింది.
బిజినెస్ మేన్ సినిమాను ప్రిన్స్ మహేష్ పుట్టిన రోజైన ఆగస్ట్ 9న థియేటర్లలో గ్రాండ్ రీ రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం మహేష్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. మహేష్ బాబును ఇండస్ట్రీ లో మరో లెవెల్ కి తీసుకెళ్లిన ఈ చిత్రం అప్పట్లో మాస్ ఆడియెన్స్ను ఎంతో ఆకట్టుకుంది. మరి ఈ మూవీ రీ రిలీజ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో తెలియాలంటే ఆగస్ట్ 9 వరకు వేచి చూడాల్సిందే.
entertainment,cinema,mahesh babu,businessman,re release,august 9,puri jagannath,mahesh birthday,mahesh fans