Mahesh Babu : ఇకపై వాళ్లే నాకు అమ్మానాన్న .. మహేష్ బాబు ఎమోషనల్
X
గుంటూరు కారం మూవీ ఈ నెల 12న గ్రాండ్గా విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్తో దుమ్మురేపిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా మహేష్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. ఇకపై అభిమానులే తనకు అమ్మానాన్న అని చెప్పారు. తన హృదయంలో అభిమానలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. సంక్రాంతి అంటే తనకు, తన తండ్రికి ఎంతో ఇష్టమని.. ఈ పండుగ వేళ సినిమా రిలీజేతే బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం ఖాయమన్నారు. కానీ ఈ సారి నాన్న లేకపోవడం బాధ కలిగిస్తోందని ఎమోషనల్ అయ్యారు.
గుంటురు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరగడం సంతోషంగా ఉందని మహేష్ అన్నారు. దీనికి త్రివిక్రమ్ కారణమని చెప్పారు. ఆయన తనకు ఫ్యామిలీ మెంబర్ అన్న సూపర్ స్టార్.. తమ అనుబంధం స్నేహాన్ని మించిందన్నారు. త్రివిక్రమ్తో చేసిన అతడు, ఖలేజా సినిమాల్లో ఓ మ్యాజిక్ ఉంటుందని.. ఈ సినిమాతో అది మరోసారి రిపీట్ అవుతుందని చెప్పారు. ఇక తెలుగుమ్మాయి శ్రీలీల ఇండస్ట్రీలో రాణించడం గొప్ప విషయమన్నారు. ఆమెతో డ్యాన్స్ చేయడం చాలా కష్టమని చెప్పుకొచ్చారు.
కాగా అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు -త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారంపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో గుంటూరు కారంలో ఉన్న ఘాటు ఎంతో తెలుసుకోవాలని ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. తనదైన ఈజ్, కామెడీ టైమింగ్తో మహేష్ అదరగొట్టాడు. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్ మహేష్ ఫ్యాన్స్ కు మంచి కిక్కిచ్చేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటిస్తుండగా.. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ మూవీ ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో వెయిట్ అండ్ సీ..