Home > సినిమా > Mahesh Babu : ‘మొదటి బీడీ తాగగానే తల తిరిగిపోయింది’.. గుంటూరు కారంపై మహేశ్ బాబు

Mahesh Babu : ‘మొదటి బీడీ తాగగానే తల తిరిగిపోయింది’.. గుంటూరు కారంపై మహేశ్ బాబు

Mahesh Babu  : ‘మొదటి బీడీ తాగగానే తల తిరిగిపోయింది’.. గుంటూరు కారంపై మహేశ్ బాబు
X

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా గుంటూరు కారం. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో మాస్ లుక్‌లో కనిపించిన మహేష్ ను చూసి అభిమానులు థియోటర్లలో రచ్చ చేస్తున్నారు. గుంటూరు కారం ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరించడంతో మహేష్ కు మరో బ్లాక్‌ బస్టర్ హిట్ పడింది. గతంలో ఏ సినిమాలో చేయని విధంగా ఇందులో డ్యాన్స్, యాక్టింగ్ ఉన్నాయి. దీంతో అవే సినిమాకు ప్లస్ అయ్యాయని కొందరంటున్నారు. కాగా ఈ సినిమా విషయాల గురించి మహేశ్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

సినిమాలో అన్ని ఒక ఎత్తైతే.. మహేశ్ బాబు బీడీ తాగే సీన్లన్నీ ఒక ఎత్తు. బీడీ తాగుతూ ఇచ్చిన ఎలివేషన్స్ కు మహేశ్ ఫ్యాన్స్ థియేటర్స్ లో రచ్చలేపారు. అవి నిజమైన బీడీలా? మహేశ్ కు ఎలాంటి అలవాట్లు లేవు కాదా? అనే సందేహం ఫ్యాన్స్ లో ఉంది. దీనిపై స్వయంగా మహేశ్ బాబునే క్లారిటీ ఇచ్చాడు. ‘నేను స్మోకింగ్ అస్సలు ఎంకరేజ్ చేయను. సినిమాలో నేను కాల్చింది ఆయుర్వేదిక్ బీడీ. లవంగం ఆకులతో తయారుచేశారు. అయితే మొదట నాకు నిజమైన బీడీనే ఇచ్చారు. షూటింగ్ లో అది కాల్చినప్పుడు మైగ్రేన్ వచ్చి తల తిరిగిపోయింది. దాన్ని భరిస్తూ షూటింగ్ చేయలేనని త్రివిక్రమ్ కు చెప్పా. అంతే.. తర్వాత రోజు నుంచి ఆయుర్వేదిక్ బీడీలు తయారుచేసి సెట్ వాళ్లు తీసుకొచ్చారు. అందులో అసలు పొగాకు ఉండదు. మింట్ ఫ్లేవర్ లో ఉండటంతో.. షూటింగ్ లో ఈజీ అయింద’ని మహేశ్ చెప్పుకొచ్చాడు.




Updated : 17 Jan 2024 7:22 AM IST
Tags:    
Next Story
Share it
Top