Home > సినిమా > వెకేషన్‌‌కు మహేష్ ఫ్యామిలీ..రాజమౌళితో సినిమా ఇంకెప్పుడు

వెకేషన్‌‌కు మహేష్ ఫ్యామిలీ..రాజమౌళితో సినిమా ఇంకెప్పుడు

వెకేషన్‌‌కు మహేష్ ఫ్యామిలీ..రాజమౌళితో సినిమా ఇంకెప్పుడు
X

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబోలో SSMB29 సినిమా రాబోతుంది. ఈ మూవీ స్టార్ట్ కాకముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది వరకే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. దీంతో ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకూ గుంటూరు కారం సినిమా తర్వాత షూట్ స్టార్ట్ అవుతుందని అన్నారు.

ఆ మూవీ రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతున్నా జక్కన్న మూవీ మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ వెళ్లారు. మహేష్ బాబు, సితార, గౌతమ్, నమ్రత హైదరాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఉన్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోసారి మహేష్ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కి వెళ్తుండటంతో రాజమౌళి సినిమా ఇంకెప్పుడు మొదలెడతారంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

ఒక వేళ రాజమౌళి మూవీ స్టార్ట్ చేస్తే వెకేషన్‌కి వెళ్లే టైం కూడా ఉండదని, అందుకే మహేష్ టూర్‌కి వెళ్లుంటారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి రాజమౌళి, మహేష్ కాంబోలో తెరకెక్కే SSMB29 సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Updated : 23 March 2024 7:18 PM IST
Tags:    
Next Story
Share it
Top