మహేశ్ ఇంట్లో స్పెషల్ గెస్ట్..వెల్కమ్ చెప్తున్న నమ్రత
X
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు ఇంట్లోకి స్పెషల్ గస్ట్ వచ్చేసింది. ఈ గెస్ట్ మాత్రం మహేశ్ ఫ్యామిలీలో ఆనందాన్ని నింపుతోంది. మహేశ్ గారాలపట్టి సితారతో ఆడుకునేందుకు రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. ఇంతకీ ఎవరా గెస్ట్ అనుకుంటున్నారా? అదే స్నూపీ. మహేశ్ బెస్ట్ హాఫ్ నమ్రత కొత్తగా తన ఇంట్లోకి ఓ కుక్కపిల్లను తీసుకొచ్చింది. దానికి ముద్దుగా స్నూపీ అని పేరు పెట్టుకుంది. ఈ మధ్యనే వీరి ఇంట్లోని సితార ఆడుకునే కుక్కపిల్ల ప్లూటో చనిపోయింది. ఆ బాధ నుంచి సితార పాప బయటపడేందుకు నమ్రతా మరో కొత్త కుక్కపిల్లను తీసుకువచ్చారు.
ఈ విషయాన్ని నమ్రత సోషల్ మీడియా వేదికగా తెలిపింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్నూపీ.. నిన్ను ప్లూటోనే మా దగ్గరకు పంపింది అంటూ కుక్కపిల్ల ఫోటోను షేర్ చేస్తూ క్యాప్షన్ రాసింది. "ఓవైపు ఒక ప్లూటోను కోల్పోయామన్న బాధ..మరోవైపు మరో కుక్కపిల్లను ప్రేమించబోతున్నామన్న సంతోషం..నిన్ను మా ఫ్యామిలీలోకి వెల్కమ్ చెబుతున్నాం స్నూపీ"..వీ లవ్ యూ సోమచ్ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది నమ్రత . ఈ పిక్ చూసిన మహేశ్ అభిమానులు ఆ పప్పీ ఎంత అమాయకంగా చూస్తోందో అని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్‌తో కలిసి గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్రివిక్రమ్- మహేశ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా. ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. వచ్చే సంవత్సరం సంక్రాంతి నాటికి గుంటూరు కారం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీకీ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.