Home > సినిమా > Mahesh Babu : మహేశ్ కొత్త మూవీ నేమ్ ఇదే....వార్త వైరల్

Mahesh Babu : మహేశ్ కొత్త మూవీ నేమ్ ఇదే....వార్త వైరల్

Mahesh Babu : మహేశ్ కొత్త మూవీ నేమ్ ఇదే....వార్త వైరల్
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) డైరెక్షన్ లో ఇంటర్నెషన్ లెవల్ లో హై బడ్జెట్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వీళిద్దరీ కాంబినేషన్ లో మూవీ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ ఇమేజ్ ని ఇంటర్నెషన్ స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు మన జక్కన్న. ఇటీవల ఆయన తీసిన RRR మూవీ రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఇక RRR గుర్తింపు తర్వాత ఆయన తీస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రంలో మహేశ్ కొత్త లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు లేని విధంగా జుట్టు, గడ్డం పెంచుకొని న్యూ లుక్ లో స్టైల్ గా కనిపిస్తున్నారు. ఈ మూవీ కోసం కసరత్తులు చేస్తున్నారు. ఇటీవల మహేశ్ న్యూ లుక్ లో ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.





ఈ క్రమంలో వీరిద్దరి సినిమాకు సంబంధించి రోజుకో రూమర్‌ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే యాక్షన్‌ అడ్వెంచర్‌ గా రూపొందనున్న ఈ చిత్రంలో ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ హీరోయిన్‌గా, హాలీవుడ్‌ ప్రముఖ నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ కీలకపాత్ర పోషించనున్నారని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా మరో క్రేజీ రూమర్ తెరపైకి వచ్చింది. ఈ మూవీకి మహరాజా , ‘మహారాజ్‌’, ‘చక్రవర్తి’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి.. ఫైనల్‌గా ఈ టైటిల్స్‌లో ఏదో ఒకటి ఫిక్స్‌ అవుతుందా? లేక మరొక టైటిల్‌ను మేకర్స్‌ ఖరారు చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. టైటిల్ బాగుందని కొందరు అంటుంటే..అంత పెద్ద ప్రాజెక్ట్ కు ఇంత సింపుల్ పేరు పెడతారా? అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు.





ఇంకొందరైతే..మునుపటి RRR మూవీలో రామ్ చరణ్, రామారావు, రాజమౌళి ముగ్గురి పేరు వచ్చేలా పెట్టినట్టు..మహేశ్, రాజమౌళిలోని మొదటి మూడక్షరాలను కలిపి ‘మహారాజా’ అని పెట్టినట్లు ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఏదైమనప్పటికీ టైటిల్ గురించి తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇక విజయేంద్రప్రసాద్‌ కథ అందించిన ఈ చిత్రానికి ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతదర్శకుడు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ ఏడాది వేసవిలో ఆరంభమవుతుందని టాక్‌.




Updated : 17 Feb 2024 9:52 AM IST
Tags:    
Next Story
Share it
Top