సూసైడ్ చేసుకోవాలనుకున్నా.. జైలర్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
X
సూపర్ స్టార్ రజనీకాంత్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా రజినీకి భారీ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం రజినీ నటిస్తున్న జైలర్ మూవీ అగస్ట్ 10న రిలీజ్ కానుంది. ఈ మూవీని నెల్సన్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా.. తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన కావాలి అనే సాంగ్ యూట్యూబ్ను షేక్ చేస్తోంది.
ఈ మూవీని ఓ వివాదం వెంటాడుతోంది. మలయాళంలో ఇదే టైటిల్తో డైరెక్టర్ సక్కిర్ మదతిల్ ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ధ్యాన్ శ్రీనివాసన్ హీరోగా నటిస్తున్నారు. అది కూడా రజినీ సినిమా విడుదల రోజే రిలీజ్ కానుంది. రజినీ మూవీ సేమ్ టైటిల్తో విడుదలైతే తమ మూవీ తీవ్రంగా నష్టపోతుందని డైరెక్టర్ వాపోతున్నాడు. తన జీవితం మొత్తం ఈ సినిమాపైనే ఆధారపడి ఉందని.. తన ఇల్లు, కూతురు బంగారం తాకట్టు పెట్టి మరీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు.
‘‘ఆర్థిక కష్టాలను భరించలేక సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చింది.. కానీ వెనక్కి తగ్గి ఈ మూవీపై ఫోకస్ పెట్టాను. ఇప్పుడు రజినీ కాంత్ మూవీ ఇదే టైటిల్తో మలయాళంలో రిలీజ్ అయితే నా మూవీ తీవ్రంగా నష్టపోతుంది. కనీసం మలయాళంలోనైనా ఈ మూవీ టైటిల్ మార్చాలి. ఈ విషయంపై ఆ సినిమా నిర్మాతలను కలిసిన ఫలితం లేదు. రజినీకాంత్ గారు ఒక్కరే నన్ను ఆదుకోగలరు. ఆయన సూపర్ స్టార్ మాత్రమే కాదు మంచి మనిషి కూడా. ఆయన రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాం’’ అని సక్కిర్ అన్నారు.
జైలర్ మూవీలో మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ సహా జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి అనిరుథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మధ్యకాలంలో రజినీ నుంచి వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేవు. దీంతో జైలర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.