Home > సినిమా > Mama Mascheendra MOVIE : ఏంటి మామా.. అప్పుడే ఆహానా..?

Mama Mascheendra MOVIE : ఏంటి మామా.. అప్పుడే ఆహానా..?

Mama Mascheendra MOVIE   : ఏంటి మామా.. అప్పుడే ఆహానా..?
X

సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేసిన సినిమా ‘మామా మశ్చీంద్రా’. నటుడు, రచయిత హర్ష వర్ధన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 6న విడుదలైంది. రిలీజ్ కు ముందు ఈ చిత్రంపై కాస్త అంచనాలున్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది సుధీర్ బాబు ఓ మంచి సినిమాతో వస్తున్నాడు అనుకున్నారు. హర్ష వర్ధన్ అంతకు ముందు ఇష్క్, మనం వంటి చిత్రాలకు డైలాగ్స్ స్క్రీన్ ప్లే అందించి ఉండటంతో దర్శకుడుగా హిట్ మెటీరియల్ తోనే వస్తున్నాడు అనుకున్నారు. బట్ మొదటి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుందీ సినిమా. మూడు పాత్రల్లో సుధీర్ బాబు ఎఫర్ట్ అద్భుతం అనిపించుకున్నా.. బలహీనమైన కథ, కథనాలతో వీలైనంత ఎక్కువగా విసిగించాడు దర్శకుడు.





నిజానికి ట్రైలర్ చూసి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకున్నారు. కానీ కాన్సెప్ట్ లు కొత్తగా ఉంటే సరిపోదు. ఎగ్జిక్యూషన్ కూడా ఆకట్టుకోవాలి. అప్పుడే సినిమాలు నిలబడతాయి అనిమరోసారి ఈ మామా మశ్చీంద్రాతో ప్రూవ్ అయింది. అయితే విడుదలైన నెల తర్వాతే ఓటిటిలో వదలాలి అనే రూల్ ఉంది. ఆ రూల్ ను బ్రేక్ చేస్తూనో లేక ఇంకెవరూ పట్టించుకోరు కాబట్టి అనే దైర్యంతోనో కొన్ని సినిమాలు ముందే ఓటిటిలో వస్తుంటాయి. అలా మూడో వారంలోనే ఈ మామ కూడా ఓటిటిలోకి వచ్చేస్తున్నాడు. ఆహా ప్లాట్ ఫామ్ లో ఈ నెల 20 నుంచి స్ట్రీమ్ కాబోతోందీ సినిమా.

సుధీర్ బాబు చాలా హోప్స్ పెట్టుకున్న సినిమా ఇది. హీరోయిన్లు ఈషా రెబ్బా, మృణాళిని రవి కూడా తెలుగులో ఈ మూవీతో బ్రేక్ వస్తుందని భావించారు. బట్ అందరి ఆశలపై ఫ్లాప్ చల్లిన ఈ మూవీ అప్పుడే ఓటిటిలోకి వస్తోంది. దీంతో చాలామంది అప్పుడే ఓటిటి ఏంటీ మామా అని సెటైర్స్ వేస్తున్నారు.


Updated : 16 Oct 2023 7:36 PM IST
Tags:    
Next Story
Share it
Top