Home > సినిమా > Jailer Villain : జైలర్ లో విలన్ గా మలయాళ మెగాస్టార్

Jailer Villain : జైలర్ లో విలన్ గా మలయాళ మెగాస్టార్

Jailer Villain : జైలర్ లో విలన్ గా మలయాళ మెగాస్టార్
X

రజనీకాంత్, మమ్ముట్టి...వీళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్ హిట్. వీళ్ళిద్దరూ కలిసి ఒకే ఒక్క సినిమా చేశారు. ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం వీళ్ళిద్దరినీ పెట్టి మణిరత్నం దళపతి సినిమా తీశారు. అది సూపర్ హిట్. ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తే చూడకుండా ఉండరు ఎవరూ. మళ్ళీ అలా ఇద్దరు సూపర్ స్టార్స్ సినిమా చేస్తే కన్నుల పండుగగా ఉంటుంది. అలాగే అనుకున్నారుట జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కూడా. కానీ రజనీ కాంత్ వద్దనేశారుట. అయ్యో ఎందుకలా అనుకుంటున్నారా...ఇది చదివేయండి మీకే తెలుస్తుంది.

నెల్సన్ దిలీప్ తీసిన జైలర్ సినిమా ఇటీవలే విడుదల అయి సక్సెస్ ఫుల్ గా దూసుకు వెళిపోతోంది. చాలా రోజుల తర్వాత రజనీ కాంత్ కు మంచి హిట్ ని ఇచ్చింది కూడా. ఇందులో రజనీతో పాటూ మోహన్ లాల్, కన్నడ నుంచి శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ లాంటి పెద్ద పెద్ద నటులు కూడా ఉన్నారు. అందరికీ మంచి రోల్స్ ఇచ్చి శభాష్ అనిపించుకున్నాడు డైరెక్టర్. అలాగే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టిని కూడా జైలర్ సినిమాలో యాక్ట్ చేయించాలని అనుకున్నారుట నెల్సన్. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కు మంచి స్కోప్ ఉంది. సినిమా చూసినవాళ్ళఉ అందరూ చాలా బావుంది ఆ పాత్ర అంటున్నారు. వినాయకన్ విలన్ గా నటించాడు. బాగా సూట్ అయ్యాడని చెప్పుకుంటున్నారు కూడా. అయితే ఈ క్యారెక్టర్ కు ఫస్ట్ మమ్మట్టి అయితే బావుంటుందని అనుకున్నారుట డైరెక్టర్.

మమ్మట్టితో విలన్ పాత్ర గురించి కూడా డైరెక్టర్ చెప్పారుట. అయితే రజనీకాంత్ కు మాత్రం ఈ విలన్ రోల్ ను మమ్ముట్టి చేయడం అస్సలు నచ్చలేదుట. నెగటివ్ పాత్రలో ఆయనను రజనీ వూహించుకోలేకపోయారుట. అందుకే మమ్ముట్టికి ఫోన్ చేసి మరీ చేయొద్దని చెప్పారుట. ఇది కాదు మనం మరొక సినిమా చేద్దామని కూడా చెప్పారుట. అందుకే మమ్ముట్టి కూడా ఆ పాత్ర చేయలేదని చెబుతున్నాడు...జైలర్ సినిమాలో రజనీకి కొడుకుగా యాక్ట్ చేసిన వసంత రవి. పైగా ఈ విషయాన్ని రజనీనే స్వయంగా సెట్స్ లో చెప్పారుట కూడా. అదండి సంగతి అలా సూపర్ స్టార్స్ ను మళ్ళీ ఒకే తెర మీద చూడడం మిస్ అయిపోయాం మనం.


Updated : 18 Aug 2023 7:55 PM IST
Tags:    
Next Story
Share it
Top