Divya Pahuja : మాజీ మోడల్ దివ్య అహుజా హత్య కేసు నిందితుడి అరెస్ట్
X
పశ్చిమ బెంగాల్‌లో మాజీ మోడల్ దివ్య పహుజాను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బాల్‌రాజ్ గిల్ గురువారం సాయంత్రం విమానం ఎక్కుతున్న పమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య కేసుకు సంబంధం ఉన్న మరో నిందుతుడు రవి బాంద్రా పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. జనవరి 2న, దివ్యను ఐదుగురు వ్యక్తులు హోటల్ సిటీ పాయింట్‌కి తీసుకెళ్లి, రూమ్ నంబర్ 111లో కాల్చి చంపి మృతదేహన్ని మాయం చేశారు.
బిఎమ్‌డబ్ల్యూలో మృతదేహాన్ని తీసుకెళ్లిన బాల్‌రాజ్‌సింగ్, రవి బంగాలు.. ఘగ్గర్ నదిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని నదిలో నుంచి వెలికితీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు అభిజిత్ సింగ్, హేమ్‌రాజ్, ఓంప్రకాష్‌లను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ హత్య గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అభిజిత్ సింగ్.. పహుజాతో సన్నిహితంగా మెలిగిన వీడియోలు ఆమె ఫోన్‌లో ఉన్నాయని వాటిని తొలగించమని అభిజిత్ సింగ్ కోరగా దానికి పహుజా నిరాకరించిందని దీంతో ఆమెను అభిజిత్ హత్య చేసి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక విచారణలో తెలింది. ఇక గుర్గావ్ పోలీసులు జనవరి 5న పంజాబ్‌లోని పాటియాలాలోని బస్టాండ్‌లో పహుజా శవాన్ని తరలించిన BMW కారును గుర్తించారు,
దివ్య పహుజా గురుగ్రామ్‌లోని అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ సందీప్ గడోలీ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో నిందుతారులుగా ఉండి.7 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించిన ఆమె బెయిల్‌పై విడుదలైంది. గడోలిలో ఫిబ్రవరి 6, 2016న గురుగ్రామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సందీప్ హతమయ్యాడు.