మంచు లక్ష్మి కాళ్ల మీద పడిన అభిమాని..వీడియో వైరల్
X
మంచు లక్ష్మి నటించిన ఆది పర్వం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో అనూహ్య ఘటన జరిగింది. స్టేజ్‌పై ఆమె మాట్లాడుతుండగా ఓ అభిమాని ఏడ్చుకుంటూ వచ్చి మంచు లక్ష్మి కాళ్ల మీద పడ్డాడు. ఈ ఘటనపై ఆమె ఆశ్యర్య పోగా వెంటనే బౌన్సర్ల అప్రమత్తమై అభిమానిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమం అయిపోయాక ఆమె అభిమానితో ఫోటో దిగారు. ఈవెంట్ అయి బయటకి వచ్చాక మంచు లక్ష్మి ఆ అబ్బాయికి ఫొటో ఇచ్చింది.
ఆ సమయంలో కూడా అతను ఏడుస్తూ కనపడటంతో మంచు లక్ష్మి అతన్ని ఓదార్చి ఫొటో ఇచ్చి వెళ్ళిపోయింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిపై మరోసారి ట్రోల్స్ వస్తున్నాయి. ఒక నటి కోసం అలా పైకెక్కి కాళ్ళ మీద పడటం ఏంటి, కావాలని చేశారా, ఏడవడం ఎందుకు అని పలువురు ట్రోల్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం మంచు లక్ష్మి చేసే సహాయ కార్యక్రమాల్లో అతనికి ఏమైనా హెల్ప్ అయిందేమో అందుకే అలా చేసాడేమో అని కామెంట్స్ చేస్తున్నారు.
— poorna_choudary (@poornachoudary1) March 19, 2024
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.