నీ యవ్వ'... కెమెరాకు అడ్డొచ్చినందుకు మంచు లక్ష్మి ఫైర్
X
తెలుగు రాష్ట్రాల్లో మంచు లక్ష్మికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ.. కెరీర్‌లో చాలా బిజీగా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు మంచు లక్ష్మి. ఆమె చేసే పోస్టులన్ని నిమిషాల వ్యవధిలో వైరలవుతుంటాయి. ఆమె మీద అదే స్థాయిలో ట్రోలింగ్ కూడా జరుగుతుంటుంది. కానీ మంచు లక్ష్మి మాత్రం.. అవేవీ పట్టించుకోదు. ఎవరు ఏమనుకున్నా సరే.. తన దారిలోనే వెళ్తుంటారు. ఈ క్రమంలో తాజాగా మంచు లక్ష్మికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. దీనిలో లైవ్‌లో ఒక వ్యక్తి మీద చేయి చేసుకున్నారు మంచు లక్ష్మి.
Manchu Lakshmi 😂😂pic.twitter.com/xjk0TfJ4ey
— Milagro Movies (@MilagroMovies) September 21, 2023
ఇటీవల దుబాయ్ వేదికగా SIIMA అవార్డ్స్ వేడుక జరిగింది. ఆ వేడుకలో మంచు లక్ష్మీ ప్రవర్తించిన తీరు పట్ల విమర్శలు వస్తున్నాయి. వేడుకలో ఆమె మాట్లాడుతుండగా.. కొందరు కెమెరాకు అడ్డుగా వచ్చారు. దీంతో ఆమె ఆగ్రహానికి లోనై వారిపై సీరియస్ అయ్యారు. ముందుగా ఓ వ్యక్తి అడ్డురాగా అతనిపై చేయి చేసుకోని.. నీ యవ్వ అన్నారు. ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్.. కట్ చేయ్ కట్ చేయ్ అంటుండగా.. లేదు లేదు ఉంచు అన్నారు మంచు లక్ష్మి. ఇంతలో మరో వ్యక్తి అడ్డు రావడంతో.. హలో డుర్ర్.. కెమెరా వెనుక నుంచి వెళ్లాలి డ్యూడ్.. మినిమం బేసిక్.. అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.