Home > సినిమా > వాళ్లను చాలా నమ్మా.. చీ.. నా మనసు విరిగిపోయింది: మంచు లక్ష్మీ

వాళ్లను చాలా నమ్మా.. చీ.. నా మనసు విరిగిపోయింది: మంచు లక్ష్మీ

వాళ్లను చాలా నమ్మా.. చీ.. నా మనసు విరిగిపోయింది: మంచు లక్ష్మీ
X

మనం ఎవరినైతే ఎక్కువ నమ్ముతామో.. వాళ్లే మనల్ని మోసం చేస్తుంటారు. అచ్చం తన లైఫ్ లో కూడా అలాంటిదే జరిగిందని మంచు లక్ష్మీ తెలిపింది. స్నేహితులు అనుకుని నమ్మినవాళ్లే.. ఒకానొక టైంలో తనను మోసం చేశారన్నది. తన తండ్రి ఎంత చెప్పినా వినిపించుకోకుండా.. కోరికోరి మోస పోయానని.. అప్పుడు తన మనసు విరిగిపోయిందని మంచు లక్ష్మి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

‘మా ఫ్యామిలీకి మంచి ఫ్రెండ్స్ అని కొంత మందిని నమ్మా. వాళ్లు ఏం చెప్పినా నిజం అనుకున్నా. మోహన్ బాబు కూతురిని కదా నన్ను ఎవరు మోసం చేస్తారులే అనుకున్నా. వాళ్ల విషయంలో నాన్న కూడా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. కానీ, నేనే వినిపించుకోలేదు. వాళ్లు నా పేరు వాడుకుపి పైకి ఎదిగారు. ఈ విషయాన్ని బయటికి చెప్పి ఆ వ్యక్తులను ఫేమస్ చేయడం నాకు నచ్చదు. 30 ఏళ్లగా తెలిసిన వాళ్లు, ఫ్యామిలీకి బాగా దగ్గర సంబంధం అయిన వాళ్లు మోసం చేయడంతో నా మనసు విరిగిపోయింది. వాళ్లవల్ల చాలా బాధపడ్డా. ఆ బాధ నుంచి నా పాప వల్ల బయటపడ గలిగా’ అని చెప్పుకొచ్చింది.




Updated : 7 July 2023 10:54 AM IST
Tags:    
Next Story
Share it
Top