Home > సినిమా > మనోజ్ దంపతుల మంచి మనసు..అనాథ పిల్లలకు ఆదిపురుష్ టికెట్లు

మనోజ్ దంపతుల మంచి మనసు..అనాథ పిల్లలకు ఆదిపురుష్ టికెట్లు

మనోజ్ దంపతుల మంచి మనసు..అనాథ పిల్లలకు ఆదిపురుష్ టికెట్లు
X

ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా జూన్ 16న విడుదల కాబోతోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రామాయణం ఆధారంగా వస్తున్న ఈ ఇతిహాస చిత్రాన్ని ప్రతి ఒక్కరు చూడాలనే ఉద్దేశంతో చాలా మంది ప్రముఖలు ఇప్పటికే భారీ సంఖ్యలో టికెట్లను కొనుగోలు చేసి ఉచితంగా అందిస్తున్నారు. అంతే కాదు స్పెషల్ షోలు వేయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ జాబితాలో స్టార్ హీరో రణ్‎బీర్ కపూర్, రామ్ చరణ్, బాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ , సింగర్ అనన్య బిర్లాలు ఉన్నారు. వీరంతా 10 వేల టికెట్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు.



తాజాగా ఈ లిస్టులో మంచు మనోజ్ దంపతులు చేరారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనాథ శరణాలయాలకు చెందిన 2500 మంది పిల్లలకు ఆదిపురుష్ సినిమా చూపించాలని మంచు మనోజ్, భూమా మౌనిక జంట నిర్ణయించుకుంది. " ఎలాంటి హద్దులు లేకుండా ప్రతి ఒక్కరు ఆదిపురుష్ సినిమా చూడాలి. అందరూ వేడుకలా జరుపుకోవాల్సిన సినిమా ఇది. రామాయణ గాథను ప్రతి ఒక్క చిన్నారి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాము. జై శ్రీరామ్ శ్లోకం ప్రతి చోట ధ్వనించాలి" అని మంచు మనోజ్ తెలిపారు.

Updated : 13 Jun 2023 11:39 AM IST
Tags:    
Next Story
Share it
Top