Home > సినిమా > గుడ్‌న్యూస్ చెప్పిన మంచు మనోజ్ దంపతులు

గుడ్‌న్యూస్ చెప్పిన మంచు మనోజ్ దంపతులు

గుడ్‌న్యూస్ చెప్పిన మంచు మనోజ్ దంపతులు
X

నటుడు మంచు మనోజ్ గుడ్ న్యూస్ చెప్పాడు. త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. తన అత్త శోభా నాగిరెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని.. మనోజ్ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సంతోషకరమైన సమయంలో అందరి ఆశీస్సులు తమపై ఉండాలని ట్వీట్ ద్వారా కోరాడు. దీనిపై స్పందించిన నెటిజన్స్.. మనోజ్- మౌనిక దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు. మనోజ్, మౌనిక చాలాకాలం నుంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు. కొన్నేళ్ల క్రితం వీరి స్నేహం ప్రేమగా మారింది. రెండు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో.. ఈ ఏడాది మార్చిలో వీరిద్దరు ఒకటయ్యారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మనోజ్‌ ‘వాట్‌ ది ఫిష్‌’ కోసం పనిచేస్తున్నాడు. వరుణ్‌ కోరుకొండ దర్శకత్వంలో ఈ సినిమా సిద్ధం అవుతుంది. దీంతోపాటు ఆయన ‘ఉస్తాద్‌’ అనే సెలబ్రిటీ గేమ్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.


Updated : 16 Dec 2023 9:45 PM IST
Tags:    
Next Story
Share it
Top