Home > సినిమా > మంచు లక్ష్మీపై మంచు మనోజ్ పొగడ్తలు

మంచు లక్ష్మీపై మంచు మనోజ్ పొగడ్తలు

మంచు లక్ష్మీపై మంచు మనోజ్ పొగడ్తలు
X

మంచు మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి మంచు లక్ష్మి ఎంట్రీ ఇచ్చి బాగానే గుర్తింపు సంపాదించుకుంది. నటిగా కాకుండా ఆమెపై వచ్చిన ట్రోల్స్‎తో ఎక్కువ ఫేమస్ అయ్యింది. ఆ విధంగానే తెలుగు ప్రజలకు పరిచయమైన మంచు లక్ష్మీలో మరో కోణం ఉన్న సంగతి చాలా మందికి తెలీదు. గ్రామీణ పేద విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు ఆమె ప్రయత్నిస్తోంది. ఈ మేరకు టీచ్ ఫర్ చేంజ్ అనే ఎన్జీవో ను స్థాపించి ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచు లక్ష్మీ అనేక స్కూళ్లను దత్తత తీసుకుని ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే విద్యార్థులకు సైతం స్మార్ట్ క్లాసులు ఇంగ్లీష్ క్లాసులు వంటివి ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా చాలామంది పిల్లలకు చదువుపరంగా సపోర్ట్ అందిస్తోంది.

ఇప్పటికే శ్రీకాకుళం యాదాద్రి జిల్లాల తో పాటు తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా 500కు పైగా ప్రభుత్వ బడులను దత్తత తీసుకున్నారు. వాటిలో మంచి ఫలితాలు వస్తున్నాయి. రెండు వారాల ముందు గద్వాల్ జిల్లాలోని 30 పాఠశాలల్ని మంచు లక్ష్మి దత్తత తీసుకుంది. తాజాగా ఈ విషయాన్ని మంచు లక్ష‍్మీ తమ్ముడు మంచు మనోజ్ ఇన్ స్టాలో షేర్ చేసి అక్కని ఆకాశానికెత్తేశాడు. 'మా అక్కని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో 30 స్కూల్స్ ని దత్తత తీసుకుంది. ఇది చాలా గొప్ప నిర్ణయం. ఈ విషయమై సహాయం చేసిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు' అని మంచు మనోజ్ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ వైరల్‌గా మారడంతో అభిమానులు మంచు లక్షీ చేసిన మంచి పనిని ప్రశంసిస్తున్నారు.


Updated : 13 July 2023 10:19 PM IST
Tags:    
Next Story
Share it
Top