Home > సినిమా > తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రమఖులు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రమఖులు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రమఖులు
X

తిరుమల శ్రీవారిని నేడు పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు, యంగ్ హీరో దగ్గుపాటి అభిరామ్, నటి సంఘవి.. తదితరులు గురువారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో విడివిడిగా దర్శించుకున్నారు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు..దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.



తొలుత ఆలయ వెలుపలకు వచ్చిన మంచు మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది మొట్టమొదటి సారిగా శ్రీనివాసుడిని దర్శనం అద్భుతంగా జరిగిందన్నారు.. ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేషన్, క్రమశిక్షణ ఇంతకు ముందు ఎప్పుడూ టిటిడిలో చూడలేదని, టిటిడి ఈవో ధర్మారెడ్డి, టిటిడి ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు దర్శనాలు చక్కగా జరుగుతుందన్నారు.. దాదాపు వంద కోట్ల ప్రాజెక్టుతో సినిమా తీస్తున్నాంమని, త్వరలోనే ఆ వివరాలు వెల్లడిస్తాంమని మంచు మోహన్ బాబు అన్నారు..



ఆ తర్వాత దర్శనం చేసుకున్న సంఘవి మీడియాతో మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల తర్వాత తిరుమలకు వచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందని, మరో ఐదేళ్ళ వరకూ సినిమాలు చేసే యోచన లేదని చెప్పిన ఆమె రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు అసలు లేదని‌ తేల్చేశారు. ఇక త్వరలో అహింస అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినీ నటుడు దగ్గుపాటి అభిరామ్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు..






Updated : 1 Jun 2023 11:21 AM IST
Tags:    
Next Story
Share it
Top