మంచు విష్ణు షాకింగ్ నిర్ణయం.. "మా" ఎన్నికలపై ఏమన్నారంటే..!
X
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్.. మా అధ్యక్షుడు మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మా ఎన్నికలు రెండేళ్లకోసారి జరగుతాయి. సెప్టెంబర్ తో పదవీకాలం ముగియనుండటంతో అదే నెలలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అసోసియేషన్ ఆడిట్ సమస్యల కారణంగా మా ఎన్నికల్ని వాయిదా వేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది మే లేదా జూన్ నెలలో ఎలక్షన్స్ నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మంచు విష్ణు పదవీ కాలాన్ని అప్పటి వరకు పొడగించినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. తాజా నిర్ణయంతో ఎన్నికలకు మరికొంత సమయం ఉండటంతో ఆలోపు సభ్యులకు ఇచ్చిన హామీలను పూర్తి చేయాలని మంచు విష్ణు భావిస్తున్నట్లు సమాచారం. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే విష్ణు మా ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
2021లో ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. సాధారణ ఎన్నికలు మించి ఫైట్ నడిచింది. గత ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ప్రకాష్ రాజ్ ప్యానెల్‌ను ఓడించింది. అప్పట్లో ఎలక్షన్ జరిగిన తీరు చర్చనీయాంశంగా మారింది. ప్రకాష్‌రాజ్ ప్యానెల్‌కు మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్ ప్రకటించగా.. మంచు విష్ణు గెలుపు మోహన్ బాబు రంగంలోకి దిగారు. పరస్పర విమర్శలు, సవాళ్లతో హీట్ ఎక్కించారు.