Home > సినిమా > మంగళవారం టీజర్ రిలీజ్.. కాంతారా 'స్టైల్'లో

మంగళవారం టీజర్ రిలీజ్.. కాంతారా 'స్టైల్'లో

మంగళవారం టీజర్ రిలీజ్.. కాంతారా స్టైల్లో
X

'RX100' హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. 'మహాసముద్రం'తో మాత్రం భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి.. మరోసారి తనకు కలిసొచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌ను నమ్ముకున్నాడు. పాయల్ ప్రధాన పాత్రలో మంగళవారం అనే బోల్డ్ సినిమా తెరకెక్కిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో కమర్షియల్ హంగులతో ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించగా.. తాజాగా ఈ రోజు సినిమా టీజర్‌ విడుదల చేశారు మేకర్స్. 1:18 నిమిషాల నిడివి గల ఈ టీజర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా, సస్పెన్స్ గా సాగింది. టీజర్ చివరలో పాయల్ తనను వేధిస్తున్న వారిపై తిరగబడ్డట్టుగా కనిపిస్తోంది.





డైరెక్టర్ అజయ్ భూపతి సినిమా గురించి చెబుతూ.. గ్రామీణ నేపథ్యంలో నేటివిటీతో కూడిన కథతో తీస్తున్న చిత్రమిదన్నారు. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ థియేటర్లలో కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని చెప్పారు. సినిమాలో మొత్తం 30 పాత్రలకూ కథలో ప్రాముఖ్యం ఉంటుందన్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. ఈ సినిమాకు 'కాంతార' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎంతో కలిసి చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు పలువురు టాలీవుడ్ నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.సైలెంట్‌ గా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇక విడుదలకు రెడీ అవుతుందనీ సమాచారం.ఈ క్రమంలో ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా చేయబోతున్నట్లు తెలుస్తుంది.











Updated : 4 July 2023 12:19 PM IST
Tags:    
Next Story
Share it
Top