Home > సినిమా > ఒకే ఫ్రేమ్‎లో రజనీ, కమల్..మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న మణిరత్నం

ఒకే ఫ్రేమ్‎లో రజనీ, కమల్..మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న మణిరత్నం

ఒకే ఫ్రేమ్‎లో రజనీ, కమల్..మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్న మణిరత్నం
X

తన డ్రిమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్' తరువాత లెజండరీ డైరెక్టర్ మణిరత్నం సినిమాలకు సెలవు పలుకుతారని ఆ మధ్య కోలీవుడ్‌ కోడై కూసింది. వయసు పెరిగిపోతుండటంతో షూటింగ్ విషయంలో మణిరత్నం చాలా ఇబ్బంది పడ్డారని టాక్ వినిపించింది. అందుకే రిస్క్ తీసుకోకుండా సినిమాలకు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయినట్లు టాక్ వినిపించింది. అయితే తాజా అప్‎డేట్‎ను బట్టి ఆ వార్త జస్ట్ రూమర్ అని అర్థమవుతోంది. ఎట్టకేలకు తన లేటెస్ట్ ప్రాజెక్ట్‎ను అనౌన్స్ చేసి ఈ రూమర్స్‎కు మణిరత్నం ఫుల్‎స్టాప్ పెట్టారు. మల్టీస్టారర్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు మణిరత్నం. అది కూడా కోలీవుడ్ స్టార్ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్‌తో ఈ మూవీ ప్లాన్ చేస్తున్నారట. కానీ, నిజానికి చాలా కాలం క్రితమే రజనీ, కమల్ కలిసి నటించకూడదని ఫిక్స్ అయ్యారట. అయితే.. మణిరత్నం కోరిక మేరకు వీరిద్దరూ 38 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే ఫ్రేమ్‎లో కనిపించేందుకు సిద్ధమయ్యారట. మణిరత్నం మూవీ కోసమే వీరిద్దరూ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారని టాక్ వినిపిస్తోంది. దీని గురించి త్వరలో అధికారికంగా ప్రకటన కూడా వస్తుందని సమాచారం. అదే కనుక జరిగితే ఇక ఫ్యాన్స్‎కు పండగే. ఈ కాంబినేషన్ రిపీట్ అయితే బాక్స్ బద్దలవ్వాల్సిందే అని అంటున్నారు అభిమానులు.











Updated : 16 Aug 2023 9:57 PM IST
Tags:    
Next Story
Share it
Top