Home > సినిమా > 'మార్కెట్ మహాలక్ష్మి' నుంచి "సాఫ్ట్‌వేర్ పోరగా" సాంగ్ రిలీజ్

'మార్కెట్ మహాలక్ష్మి' నుంచి "సాఫ్ట్‌వేర్ పోరగా" సాంగ్ రిలీజ్

మార్కెట్ మహాలక్ష్మి నుంచి సాఫ్ట్‌వేర్ పోరగా సాంగ్ రిలీజ్
X

కేరింత మూవీ ఫేమ్ పార్వతీశం, కొత్త హీరోయిన్ ప్రణికాన్విక జంటగా నటిస్తోన్న సినిమా 'మార్కెట్ మహాలక్ష్మి'. బి2పి స్టూడియోస్ బ్యానర్ పై అఖిలేష్ కలారు నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని విఎస్. ముఖేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. డిఫరెంట్ కంటెంట్ తో రూపొందుతోన్న ఈ మూవీ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. కొన్నాళ్ల క్రితం వచ్చిన టీజర్ చాలామందిని ఆకట్టుకుంది. ఒక మార్కెట్ లో పనిచేస్తోన్న అమ్మాయిని తొలి చూపులోనే ప్రేమించి ఆమె కోసం సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి మార్కెట్ లో పాగా వేసిన కుర్రాడి కథతో రూపొందుతోన్న సినిమా అని టీజర్ చూస్తే అర్థం అయింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి "సాఫ్ట్ వేర్ పోరగా .. " అనే పాటను విడుదల చేశారు.

కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు. మార్కెట్ మహాలక్ష్మి ప్రణీకాన్విక మనసుని గెలుచుకోవాలనే తపనతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పార్వతీశం చేసిన ప్రయత్నాలను ఈ సాంగ్ ద్వారా వివరిస్తుంది. డైరెక్టర్ 'విఎస్ ముఖేష్' రాసిన పదాలు, జో ఎన్ మవ్ గ్రూవీ బీట్‌లు మరియు లోకేశ్వర్ ఎడార ఎనర్జిటిక్ వాయిస్ ఈ క్రేజీ సాంగ్‌కు స్పెషల్ అట్రాక్షన్ అయింది. త్వరలోనే విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్, కేదార్ శంకర్, తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Updated : 7 March 2024 2:43 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top