Home > సినిమా > Market Mahalakshmi : మార్కెట్ మహాలక్ష్మి అందరికీ నచ్చుతుంది: టీమ్

Market Mahalakshmi : మార్కెట్ మహాలక్ష్మి అందరికీ నచ్చుతుంది: టీమ్

Market Mahalakshmi : మార్కెట్ మహాలక్ష్మి అందరికీ నచ్చుతుంది: టీమ్
X

కేరింత మూవీ ఫేమ్ పార్వతీశం, ప్రణికాన్విక జంటగా నటించిన సినిమా ‘‘మార్కెట్ మహాలక్ష్మి’’. అఖిలేష్ కలారు నిర్మించిన ఈ చిత్రాన్ని విఎస్ ముఖేష్ డైరెక్ట్ చేశాడు. హర్షవర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాశ్, కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ట్రైలర్ లాంచింగ్ జరిగింది. ఈ సందర్భంగా ..





హీరో పార్వతీశం మాట్లాడుతూ.. ''కేరింత తర్వాత మంచి హిట్‌ కొట్టలేకపోయాను. వరుస నిరాశల తర్వాత నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను, అప్పుడే ముఖేష్‌ నాకు కథ చెప్పాడు. మొదట్లో దర్శకుడిపై నమ్మకం లేదు. కానీ 4-5 రోజుల షూటింగ్ తర్వాత అతనిపై నాకు నమ్మకం ఏర్పడింది. కేరింత చిత్రానికి ఎంత మంచి పేరు వచ్చిందో అదే విధంగా మార్కెట్ మహాలక్ష్మి నాకు మంచి పేరు తెస్తుందని నమ్ముతున్నాను’’ అన్నాడు.





హీరోయిన్ ప్రణీకాన్విక మాట్లాడుతూ.. ‘‘తెలుగులో ఇది నా మొదటి సినిమా, సోషల్ మీడియాలో మా ప్రమోషన్స్‌కి వస్తున్న రెస్పాన్స్‌ని చూస్తున్నాను. మంచి టాలెంట్‌ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తున్నారు, మార్కెట్ మహాలక్ష్మి లో మహాలక్ష్మిగా నన్ను ప్రేమించి ఆదరిస్తారని నమ్మకం ఉంది’’.. అని చెప్పింది.





నటుడు ముక్కు అవినాష్ మాట్లాడుతూ.. "మార్కెట్ మహాలక్ష్మిలో నేను రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. పార్వతీశం, హీరోయిన్ ప్రణీకాన్వికతో నా కాంబినేషన్ సీన్స్ నవ్విస్తాయి. దర్శకుడు నా క్యారెక్టర్‌ని చాలా బాగా డిజైన్ చేశారు. మార్కెట్ మహాలక్ష్మిని థియేటర్లలో చూసి మా టీమ్‌కి సపోర్ట్ చేయండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి మరియు నిర్మాతకి థాంక్స్".. అన్నాడు.





డైరెక్టర్ 'వియస్ ముఖేష్' మాట్లాడుతూ.. ‘‘నేను కథ రాసుకున్నప్పుడు టైటిల్ వెంటనే తట్టింది, మార్కెట్ మహాలక్ష్మి. అప్పుడే ఫిక్స్ అయ్యాను. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ లాంటి హీరోలు, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు అయ్యితే బాగుంటుంది అని కానీ, బడ్జెట్ పరిమితుల కారణంగా, మేము పార్వతీశం మరియు ప్రణీకాన్వికా ని మాత్రమే తీసుకోగలిగాము." నిర్మాత అఖిలేష్ మాట్లాడుతూ, "సపోర్ట్ చేసిన టీమ్ అందరికీ ధన్యవాదాలు. మేము కంటెంట్ ‌పై నమ్మకం ఉంచాము. మార్కెట్ మహాలక్ష్మిని ప్రజలు ఆదరిస్తారని నేను భావిస్తున్నాను. మా సినిమాను థియేటర్లలో చూడండి మాకు సపోర్ట్ చేయండి" అని అన్నారు.






Updated : 12 March 2024 8:16 AM GMT
Tags:    
Next Story
Share it
Top