Market Mahalaxmi : మార్కెట్ మహాలక్ష్మి మూవీ 'కాన్సెప్ట్ మోషన్ పోస్టర్' రిలీజ్
X
కేరింత మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, నూతన పరిచయం హీరోయిన్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు. ఈ మూవీ 'కాన్సెప్ట్ మోషన్ పోస్టర్' ని డైరెక్టర్ & రైటర్ 'బివిఎస్ రవి' ట్విట్టర్ ద్వారా డిజిటల్ లాంచ్ చేస్తూ, గతంలో హీరో పార్వతీశం తన మూవీస్ తో ప్రేక్షకులని అలరించాడని 'మార్కెట్ మహాలక్ష్మి' తో మంచి సక్సెస్ అందుకోవాలని టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ సందర్భగా డైరెక్టర్ 'వియస్ ముఖేష్' మాట్లాడుతూ ‘సినిమా ఇండస్ట్రీ కి కొత్త వాళ్ళు ఎవ్వరు వచ్చిన మొదటగా వెల్కమ్ చెప్పి ప్రోత్సహించే వ్యక్తుల్లో 'బివిఎస్ రవి' గారు ఒకరు. మా సినిమా కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయమని అడగగానే, ఓకే చెప్పి మా టీమ్ ని బ్లెస్స్ చేసినందుకు చాలా సంతోషం’.. అన్నారు.