The Marvels Trailer: హలో బ్రదర్ కాన్సెప్ట్లో అవేంజర్ సినిమా.. ఒక్కరు కాదు.. ఈసారి ముగ్గురు..!
X
యాక్షన్, అడ్వెంచర్ కథతో థ్రిల్ చేయడానికి మార్వెల్ స్టూడియోస్ నుంచి మరో సినిమా రాబోతోంది. శుక్రవారం (జులై 21) ది మార్వెల్స్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. కెప్టెన్ మార్వెల్ ఉంటే ఆ సీన్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కూడా మార్వెల్ మూవీస్ కు అతీతమేమి కాదని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. మార్వెల్ పవర్స్ తో ముగ్గురు సూపర్ హీరోలు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. కెప్టెన్ మార్వెట్, మిస్ మార్వెల్, కెప్టెన్ మోనికా రాంబ్యూలు ఈ ట్రైలర్ లో కనిపించే సరికి.. ఈ సినిమాపై ఎక్కడే లేని అంచనాలు పెరిగిపోయాయి.
ఈ ముగ్గురు సూపర్ హీరోలు కలిసి చేసే స్టంట్స్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు మార్వెల్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలాగే ఈ సినిమాలో కూడా.. భూమిని నాశనం చేయాలను కునే రాక్షసుల నుంచి ప్రజలకు కాపాడటానికి హీరోలు ఫైట్ చేస్తారు. కానీ, తెలియకుండానే ఒకరి సీన్ లోకి ఒకరు (టెలి పోట్రేట్) అవుతుంటారు. ఓ సంఘటన ఒకరికి జరిగితే.. మరొకరికి కూడా అదే జరుగుతుంటుంది. ఈ క్రమంలో జరిగే ఫైట్ సీన్స్ ను అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాను నియా డకోస్టా డైరెక్ట్ చేస్తున్నాడు. కెవిన్ ఫీజ్ నిర్మాత. ది మార్వెల్స్ సినిమా భారత్ లో ఇంగ్లీష్ తో పాటు.. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది. దీపావళి టైంలో సినిమా రిలీజ్ కానుంది. అయితే, ఈ ట్రైలర్ చూసిన టాలీవుడ్ ఫ్యాన్స్.. ఈ సినిమా నాగార్జున హలో బ్రదర్ సినిమా కాన్సెప్ట్ ను కాపీ కొట్టారని అంటున్నారు. హలో బ్రదర్ లో కూడా ఒక హీరోకు జరిగిన ఘటన మరో హీరోకు జరుగుతుంటుంది.