Home > సినిమా > 'మీ టూ' కేసులో కన్నడ నటికి నోటీసులు...సాక్ష్యాలు చూపించండి..

'మీ టూ' కేసులో కన్నడ నటికి నోటీసులు...సాక్ష్యాలు చూపించండి..

మీ టూ కేసులో కన్నడ నటికి నోటీసులు...సాక్ష్యాలు చూపించండి..
X

మీటూ కేసులో నటి శుత్రి హరిహరన్‌‎కు చుక్కెదురైంది. ప్రముఖ నటుడు అర్జున్‌పై ఆమె చేసిన ఆరోపణలపై సరైన సాక్ష్యాధారాలు అందించాలని తాజాగా శ్రుతిని కోర్టు కోరింది. ఇందుకు సంబంధించి బెంగళూరు 8వ ఎసిఎంఎం కోర్టు శ్రుతితో పాటు పోలీసులకు నోటీసులు జారీ చేసింది.

2018 అక్టోబర్‎లో కన్నడ నటి శృతి హరిహరన్‌ తన సోషల్ మీడియా అకౌంట్‎లో 'మీ టూ' ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో నాలుగు పేజీల లేఖ రాసి షేర్ చేసింది. విస్మయ సినిమా షూటింగ్ సమయంలో ప్రముఖ నటుడు అర్జున్ సర్జా తనను లైంగికంగా వేధించాడని, తనపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు తెలిపింది. అప్పట్లో ఈ లేఖ కన్నడనాట పెద్ద దుమారమే లేపింది.ప్రముఖ దివంగత నటుడు, రాజకీయ నాయకుడు అంబరీష్ నేతృత్వంలో కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించినప్పటికీ, శృతి నటుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2018లో శృతి హరిహరన్ తనపై రూ. 5 కోట్ల పరువు నష్టం కేసు పెట్టిందన్న ఆరోపణలను నటుడు అర్జున్ సర్జా పూర్తిగా తోసిపుచ్చారు. ఈ కేసులో ఆమెపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఎఫ్ఐఆర్ నమోదైంది.

ఈ కేసుపై విచారణ చేపట్టిన బెంగళూరులోని కబ్బన్‌పార్క్‌ పోలీసులు సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టులో బీ-రిపోర్ట్‌ దాఖలు చేశారు. ఈ రిపోర్టును సవాల్ చేసింది శృతి. కోర్టు కేసును మూసివేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా కోర్టు ఆమె చేస్తున్న ఆరోపణలపై సాక్ష్యాధారాలు అందించాలని కోరింది.

Updated : 10 Jun 2023 10:33 AM IST
Tags:    
Next Story
Share it
Top