Home > సినిమా > ఆ రెండే నా మైండ్‌లో తిరిగేవి.. రీ ఎంట్రీపై మీరా జాస్మిన్‌ కామెంట్స్‌

ఆ రెండే నా మైండ్‌లో తిరిగేవి.. రీ ఎంట్రీపై మీరా జాస్మిన్‌ కామెంట్స్‌

ఆ రెండే నా మైండ్‌లో తిరిగేవి.. రీ ఎంట్రీపై మీరా జాస్మిన్‌ కామెంట్స్‌
X

నైన్టీస్ యూత్ క్రష్ లో ఉన్న నటి మీరా జాస్మిన్. అమ్మాయి బాగుంది సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన మీరా.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత గుడుంబా శంకర్, భద్ర, మహారథి, బంగారు బాబు లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ లో బిజీగా ఉన్న మీరా.. 2013లో విడుదలైన మోక్షతో సినిమాలకు దూరం అయింది. మళ్లీ పదేళ్ల తర్వాత సినిమాల్లో తిరిగి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.

తను నటించి విమానం జూన్ 9 విడుదల కానున్నసందర్భంగా.. సోషల్ మీడియాలో తన అనుభవాల్ని పంచుకున్నారు. ‘చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. విమానం కథ నాకు చాలా నచ్చింది. కథ వినగానే నటించడానికి ఒప్పుకున్నా. ఆ రోజంతా అందులోని క్యారెక్టర్లు, కథ నా మైండో తిరిగాయి. నేను కథ ఎంచుకున్నానా లేక కథ నన్ను ఎంచుకుందా అనిపించింది. సినిమాపై నేను పొందిన అనుభూతే మీకూ కలుగుతుంది అనుకుంటున్నా’ అని మీరా అన్నారు.

శివ ప్రసాద్ యానాల డైరెక్షన్ లో సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన సినిమా విమానం. ఇందులో మీరా జాస్మిన్, అనసూయ, రాహుల్ రామకృష్ణ, మస్టర్ ధ్రువన్ కీలక పాత్రలో నటించారు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. విమానం ఎక్కాలన్న తన కొడుకు కోరికను అంగవైకల్యం కలిగిన తండ్రి ఎలా నెరవేర్చుతాడు అన్న కథ.


Updated : 1 Jun 2023 4:52 PM IST
Tags:    
Next Story
Share it
Top