Home > సినిమా > రీఎంట్రీ అంటే ఇది.. హీరోయిన్గా ఆఫర్.. పదేళ్లయినా క్రేజ్ తగ్గలే..

రీఎంట్రీ అంటే ఇది.. హీరోయిన్గా ఆఫర్.. పదేళ్లయినా క్రేజ్ తగ్గలే..

రీఎంట్రీ అంటే ఇది.. హీరోయిన్గా ఆఫర్.. పదేళ్లయినా క్రేజ్ తగ్గలే..
X

నైన్టీస్ యూత్ క్రష్ లిస్ట్ లో మొదటి వరుసలో ఉండే హీరోయిన్ మీరా జాస్మిన్. అమ్మాయి బాగుంది సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన మీరా.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత గుడుంబా శంకర్, భద్ర, మహారథి, బంగారు బాబు లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్ లో బిజీగా ఉన్న మీరా.. 2013లో విడుదలైన మోక్షతో సినిమాలకు దూరం అయింది. మళ్లీ పదేళ్ల తర్వాత సినిమాల్లో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. విమానం సినిమాతో తిరిగి ఫామ్ అందుకుంది. తాజాగా మరో ఆఫర్ కొట్టేసింది. అయితే ఈసారి ఏకంగా హీరోయిన్ చాన్స్ కొట్టేసింది.

శ్రీవిష్ణు, హీరోయిన్ రీతూ వర్మ జంటగా నటిస్తున్న స్వాగ్ సినిమాలో మీరాకు ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. అందులో సెకండ్ హీరోయిన్ గా ఆఫర్ కొట్టేసింది. నలభై ఏళ్ల పైబడిన మీరా.. ఇన్ స్టాగ్రామ్ లో ఫొటోలు అప్ లోడ్ చేస్తూ గ్లామర్ షో చేస్తోంది. దాంతో డైరెక్టర్ల దృష్టిలో పడింది. తాజాగా మలయాళ సినిమాల్లో అవకాశాలు భారీగా వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ లో హారోయిన్ గా ఆఫర్ కొట్టేసింది. రాజ రాజ చోరా సినిమా డైరెక్టర్ హసిత్ గోలీ డైరెక్షన్ లో వస్తున్న స్వాగ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా వస్తున్న మీరా.. ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Updated : 17 Aug 2023 6:40 PM IST
Tags:    
Next Story
Share it
Top