Home > సినిమా > varun Tej : గ్రాండ్గా వరుణ్ - లావణ్య రిసెప్షన్.. సెలబ్రిటీల సందడి

varun Tej : గ్రాండ్గా వరుణ్ - లావణ్య రిసెప్షన్.. సెలబ్రిటీల సందడి

varun Tej : గ్రాండ్గా వరుణ్ - లావణ్య రిసెప్షన్.. సెలబ్రిటీల సందడి
X

మెగా న్యూ కపుల్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల రిసెప్షన్ గ్రాండ్గా జరిగింది. హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెషన్‌లో జరిగిన ఈ వేడుకలో పలువురు సెలబ్రెటీలు సందడి చేశారు. అక్కినేని నాగ చైతన్య, సుకుమార్, అలీ, సీనియర్‌ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సహా పలువురు సెలబ్రెటీలు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.




గ్రాండ్గా వరుణ్ - లావణ్య రిసెప్షన్.. సెలబ్రిటీల సందడిఈ నెల 1న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టస్కానీలో వీరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్ సహా నితిన్ దంపతులు వీరి పెళ్లిలో సందడి చేశారు. 2017లో వచ్చిన మిస్టర్ సినిమాతో మొదలైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. అంతరిక్షం సినిమా సమయంలో వారిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చాలా పార్టీల్లో ఈ లవ్ బర్డ్స్ జంటగా తిరిగినా.. బయట కలిసి కనిపించింది మాత్రం చాలా తక్కువే. ఆరేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో వీరిద్దరూ ఒక్కటయ్యారు.





Updated : 5 Nov 2023 4:59 PM GMT
Tags:    
Next Story
Share it
Top