హీరోయిన్గా మెగా డాటర్.. షూటింగ్ షురూ
X
మెగా డాటర్ నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. తాజాగా హీరోయిన్గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. RDX వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన మలయాళ హీరో షాన్ నిగమ్‌తో నిహారిక జత కట్టనుంది. మద్రాస్ కారన్ టైటిల్తో వస్తున్న ఈ సినిమాకు వాలిమోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు సినిమా పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. నిహారికతో పాటు కలైయరసన్, ఐశ్వర్య దత్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సినిమా పూజా కార్యక్రమానికి దర్శకుడు పాన్ రామ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. డైరెక్టర్ వాలిమోహన్ తనకు మంచి మిత్రుడని, ప్రతి సినిమా షూటింగ్ కు ముందు చర్చించుకుంటామని చెప్పారు. షాన్ నిగమ్ తనకు చాలా ఇష్టమైన నటుడని, నటుడు కలైయరసన్ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. ఈ టీమ్ కలిసి చిత్రం చేయడం సంతోషంగా ఉందన్నారు. మద్రాస్ కారన్ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
మెడ్రాస్ కారన్ మంచి యాక్షన్ డ్రామా మూవీ అని చిత్ర దర్శకుడు వాలిమోహన్‌దాస్ అన్నారు. చిత్ర షూటింగ్ చైన్నె, మధురై, కొచ్చి ప్రాంతాల్లో జరుగుతుందని చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు.