సంక్రాంతి సెలబ్రేషన్స్లో మెగా ఫ్యామిలీ.. కొత్త కోడలు ఏం చేస్తోందంటే..?
X
మెగా ఫ్యామిలీలో సంక్రాంతి సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరుగుతున్నాయి. బెంగళూరులోని ఓ ఫాంహౌస్లో మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ సంక్రాంతి సంబరాలను జరుపుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీలోకి కొత్తగా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠికి సంబంధించిన ఓ వీడియో పోస్ట్ చేసింది. ‘‘ఇంట్లోవాళ్ల కోసం కొత్త కోడలు సున్నండలు చేస్తోంది.. తను ఎంతో స్వీట్’’ అని కామెంట్ చేసింది.
ఉపాసన వీడియోపై లావణ్య స్పందించారు. ‘‘థ్యాంక్యూ.. సూపర్ స్వీట్ పెద్ద కోడలు’’ అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ప్రతీ సంక్రాంతికి మెగా ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరుతుంది. పండుగను సంబురంగా జరుపుకుంటారు. ఈ సారి సెలబ్రేషన్స్లో లావణ్య త్రిపాఠి, క్లీంకార యాడ్ అవడంతో మరింత స్పెషల్గా మారాయి. ఇక రామ్ చరణ్ దోశలు వేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా శనివారం పంజా వైష్ణవ్ తేజ్ బర్త్ డేను సైతం అక్కడే జరుపుకున్నారు.