Home > సినిమా > సాయిధరమ్ తేజ్ ఇంకా కోలుకోలేదా.. మళ్లీ సర్జరీ??

సాయిధరమ్ తేజ్ ఇంకా కోలుకోలేదా.. మళ్లీ సర్జరీ??

సాయిధరమ్ తేజ్ ఇంకా కోలుకోలేదా.. మళ్లీ సర్జరీ??
X

‘విరూపాక్ష’తో సూపర్ హిట్ అందుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. మరో వారంలో మేనమామ పవన్ కళ్యాణ్ తో కలసి.. ‘బ్రో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే.. ఒక ప్రముఖ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ.. ఓ షాకింగ్ విషయం చెప్పాడు తేజ్. సినిమా విడుదలయ్యాక.. మరో సినిమా చేయడానికి ఆరు నెలలు గ్యాప్ తీసుకోబోతున్నట్లు వెల్లడించాడు

రెండేళ్ల క్రితం సాయి ధరమ్ బైక్ యాక్సిడెంట్ కి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం కారణంగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ.. కొన్నాళ్ళు పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇటీవల విరూపాక్షతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. మూడు నెలల గ్యాప్ లో బ్రో మూవీని కూడా తీసుకు రావడంతో అభిమానులు హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే ఈ సినిమా తరువాత ఆరు నెలలు పాటు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు వెల్లడించి అందర్నీ షాక్ కి గురి చేశాడు. సాయి ధరమ్ తేజ్ ఆ బైక్ యాక్సిడెంట్ నుంచి ఇంకా రికవరీ అవ్వలేదట. సరిగ్గా పరిశీలిస్తే విరూపాక్ష సినిమాలో తేజ్ నటించిన కొన్ని కొన్ని సీన్లలో కూడా ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం తీసుకోవాలని అనుకుంటున్నాడట. అలాగే ప్లేట్స్ తొలిగించడానికి ఒక చిన్న సర్జరీ కూడా ఉన్నట్లు వెల్లడించాడు. కాబట్టి ఒక ఆరు నెలలు పాటు గ్యాప్ తీసుకోని కంప్లీట్ రెస్ట్ లో ఉండి పూర్తిగా కోలుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే ప్రెజెంట్ ఎటువంటి సినిమా కథలు కూడా వినలేదని, అయితే ఈమధ్యలో తన ఫ్రెండ్స్ తో కలిసి చేసిన ఒక షార్ట్ ఫిలింని మాత్రం ఇండిపెండెన్స్ రోజు రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. సైనికుల భార్యలు.. తమ భర్తలని దేశం కోసం పంపించి ఎటువంటి త్యాగం చేస్తున్నారు అనేది ఆ షార్ట్ ఫిలిం స్టోరీ అంట.

Updated : 19 July 2023 10:28 AM IST
Tags:    
Next Story
Share it
Top