30 ఏళ్ళ వెనుకటి కథతో మెగా హీరో
X
మెగా వారసుడు వరుణ్ తేజ్....హిట్ సినిమాల రేస్ లో ఉండకపోయినా తనకంటూ ఒక ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ప్రస్తుతం ఇతనిది గాండీవధారి అర్జున సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆగస్టు 25న ఈ సినిమా విడుదల అవుతోంది. దీని తర్వాత పలాస డైరెక్టర్ కరుణ కుమార్ దర్శకత్వంలో వరుణ్ సినిమా చేయనున్నారు.
పలాస, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలతో దర్శకుడు కరుణ కుమార్ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్నారు. మొదటి సినిమా పలాసతోనే తెలుగు ప్రేక్షకులను ఆకర్షించారు. ఆ సినిమా, అందులో పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. తర్వాత సుధీర్ బాబుతో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా చేశారు. అది పెద్దగా హిట్ అవ్వకపోయినా....మంచి సినిమా అనిపించుకుంది. ఇప్పుడు వరుణ్ తేజ్ తో మరో కొత్త కాన్సెప్ట్ తో మర ముందుకు రాబోతున్నారు. 1990ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ ఉంటుందిట. చాలా రీసెర్చ్ చేసి మరీ దర్శకుడు కథను సిద్ధం చేశారట. ఇప్పటి వరకు తన కెరీర్లో చేయనటువంటి పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తారని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. ఈ పాత్ర కోసం వరుణ్ తన మేకోవర్ ని కూడా మార్చుకోనున్నారట.
ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కించనున్నారుట. అదే నిజమైతే కనుక కరుణకుమార్ కు ఇదే మొట్టమొదటి భారీ బడ్జెట్ సినిమా అవుతుంది. మరోవైపు వరుణ్ తేజ్ కి కూడా పెద్ద సినిమా ఇదే అవుతుంది. దీన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజేందర్ రెడ్డి తీగల, మోహన్ చేకూరి నిర్మించనున్నారు.ఈ చిత్రాన్ని జులై 27న లాంఛ్ చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ ని సంగీత దర్శకుడిగా తీసుకునే ఆలోచిస్తోంది మూవీ టీమ్. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి.
mega hero varun tej next movie with palasa director karuna kumar. movies, telugu, mega family, hero, varun tej, hero, director, karuna kumar, palasa, new