అది నా పెళ్ళి...దాన్ని పబ్లిక్ చేయాలని లేదు
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య పెళ్ళి గురించి రోజుకో రూమర్ వస్తూనే ఉంది. వాళ్ళిద్దరికీ నిశ్చితార్ధం అయిన దగ్గర నుంచీ...వాళ్ళ పెళ్ళి ఎక్కడ చేసుకుంటారనే దాని మీద ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. అలాగే డేట్స్ గురించి కూడా. వీటన్నింటికీ వరుణ్ చెక్ పెట్టాడు. తాజాగా ఒక చిట్ చాట్ లో వీటికి సంబంధించిన క్లారిఫికేషన్ ఇచ్చాడు.
మా పెళ్ళి నవంబర్ లేదా డిశంబర్ లో ఉంటుంది అంటూ తేల్చి చెప్పేశాడు వరుణ్ తేజ్. నాకయితే హైదరాబాద్ లోనే చేసుకోవాలని ఉంది. కానీ ఇక్కడ చేసుకుంటే అది ప్రైవేట్ కార్యక్రమంలా ఉండదు. పబ్లిక్ ఈవెంట్ లా మారిపోతుంది. అందుకే ఇక్కడ చేసుకోవడం లేదని తేల్చి చెప్పేశాడు వరుణ్. డెస్టినేషన్ వెడ్డింగే ఉంటుంది. భారత్ లోనే మూడు, నాలుగు ప్రాంతాలు చూశాము. త్వరలోనే ఒకదాన్ని ఫిక్స్ చేస్తామని చెప్పాడు. పెళ్ళికి సంబంధించిన షాపింగ్ లాంటి పనులు జరుగుతున్నాయని తెలిపాడు.
తాను, లావణ్య లాస్ట్ ఐదేళ్ళుగా ప్రేమించుకుంటున్నామని...బయటకు చెబితే తమ మధ్యే చిన్న చిన్న తగాదాలు వస్తాయేమోనని బయటకు చెప్పలేదని అంటున్నాడు వరుణ్. ఇక మెగా ప్రిన్స్ ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దీనికి దర్శకత్వం వహించారు. ఈ నెల 25న ఈ మూవీ రిలీజ్ అవనుంది.