Home > సినిమా > Varun Tej : పవన్ కల్యాణ్తో సినిమా.. మెగా ప్రిన్స్ ఏమన్నారంటే..?

Varun Tej : పవన్ కల్యాణ్తో సినిమా.. మెగా ప్రిన్స్ ఏమన్నారంటే..?

Varun Tej  : పవన్ కల్యాణ్తో సినిమా.. మెగా ప్రిన్స్ ఏమన్నారంటే..?
X

(Varun Tej) మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తోన్న కొత్త మూవీ ఆపరేషన్ వాలంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్గా చేస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ముందుగా ఈ మూవీని ఫిబ్రవరి 16న రిలీజ్ చేయాలనుకున్న సోలో రిలీజ్లో భాగంగా మార్చి 1న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ టీం ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్లో వరుణ్ తేజ్ సందడి చేశారు.

ఈ సందర్భంగా స్టూడెంట్స్ ప్రశ్నలకు వరుణ్ ఆన్సర్స్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తో సినిమా ఎప్పుడు చేస్తున్నారని ఓ స్టూడెంట్ అడగ్గా.. మెగా ప్రిన్స్ ఆసక్తికర సమాధానం చెప్పారు. బాబాయ్తో నటించాలన్న కోరిక తనకు ఉందన్నారు.అయితే దానికి మంచి కథ సెట్ కావాలని చెప్పారు. కథ సెట్ అయితే బాబాయ్తో సినిమా చేస్తానని స్పష్టం చేశారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తెలుగులో వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే కావొచ్చని అన్నారు. కమర్షియల్ సినిమాలు ఎన్ని చేసిన.. దేశం కోసం చేసే సినిమా ఎంతో గొప్పగా అనిపిస్తుందని అభిప్రాపడ్డారు.





అదేవిధంగా తన ఫెవరెట్ ఎవరు అని మరో స్టూడెంట్ అడగ్గా.. తన ఫెవరెట్ హీరోయిన్ను పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. మంచి కథ కుదిరితే తాము ఇద్దరం కలిసి నటిస్తామని చెప్పారు. ఇక లావణ్య తర్వాత సాయిపల్లవి తన అభిమాన హీరోయిన్ అని చెప్పారు. లావణ్యతో సినిమా చేస్తావరుణ్ పెళ్లి అయ్యాక విడుదలవుతోన్న ఫస్ట్ మూవీ ఇదే. 2017లో వచ్చిన మిస్టర్ సినిమాతో మొదలైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. అంతరిక్షం సినిమా సమయంలో వారిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి.ఆరేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో వీరిద్దరూ ఒక్కటయ్యారు.





Updated : 7 Feb 2024 1:36 AM GMT
Tags:    
Next Story
Share it
Top