Home > సినిమా > మెగాస్టార్ చిరంజీవి శుభవార్త..అందరికీ ఉచితంగా..

మెగాస్టార్ చిరంజీవి శుభవార్త..అందరికీ ఉచితంగా..

మెగాస్టార్ చిరంజీవి శుభవార్త..అందరికీ ఉచితంగా..
X

క్యాన్సర్.. ఎంత పెద్ద మహమ్మారి అనేది అందరికీ తెలిసిందే. ముందుగానే గుర్తిస్తే క్యాన్సర్‌‌‌ నుంచి సులభంగా బయటపడొచ్చని ఇటీవల ఓ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. అందుకు తన సహాయ సాకారాలు అందించేందుకు ముందడుగు వేశారు.

ఎంతోమంది పేదవారు తన అభిమానుల్లో, సినీ కార్మిక వర్గాల్లో ఉన్నారని.. వారందరికీ టెస్టులు, స్క్రీనింగ్ చేయించుకునేందుకు తాను ముందుకు వస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. ఈ మేరకు

డాక్టర్ గోపిచంద్‌తో కలిసి చిరంజీవి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. స్టార్‌ క్యాన్సర్‌ సెంటర్‌, చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్తంగా క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ నిర్వహించనున్నట్లు వివరించారు. జులై 9న హైదరాబాద్, 16న వైజాగ్, 23న కరీంనగర్ లో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు ఏర్పాటు చేయున్నట్లు వెల్లడించారు. ముందుగా జూలై 9న హైదరాబాద్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఆవరణలో - గుర్తింపు కార్డు ఉన్న సినీకార్మికుల కుటుంబసభ్యులందరికి నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రోజు వెయ్యి మందికి క్యాన్సర్‌ పరీక్షలు చేయించనున్నట్లు మెగాస్టార్ తెలిపారు.

అనంతరం విడతలవారీగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలవారీగా ఇలాంటి కార్యక్రమాలు పెడితే ఎన్ని కోట్లు అయినా తాను భరిస్తానని మెగాస్టార్ హామీ ఇచ్చారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిరంజీవి కోరారు.​ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులలో నిర్ధారితమైన క్యాన్సర్ బాధితులకు తదుపరి చికిత్సావకాశాలు, సూచనలు, సలహాలు స్టార్ హాస్పిటల్, నానక్ రామ్ గూడలో లభిస్తాయి


Updated : 23 Jun 2023 8:27 PM IST
Tags:    
Next Story
Share it
Top