Mega Star Chiranjeevi : చిరు రెమ్యునరేషన్లో ఏం జరిగింది? బయటపడ్డ షాకింగ్ నిజాలు
X
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ ఇటీవల విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. సినిమా రిలీజ్ అయిన మార్నింగ్ షో నుంచే సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. సోషల్ మీడియా ట్రోలింగ్‌తో బాక్సాఫీస్ కలెక్షన్లు పడిపోతూ వస్తున్నాయి. తొలి రోజు 15 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ మూవీ.. తర్వాతి రెండు రోజులు అందులో ఐదో వంతు మాత్రమే కలెక్షన్స్ రాబట్టింది. గత రెండు, మూడు రోజులుగా మరీ దారుణంగా మూడేసి కోట్లు మాత్రమే వసూళ్లు రావడం గమనార్హం. ఇక ఇప్పుడు మినిమం కలెక్షన్స్ లేక థియేటర్ రెంట్లు కూడా చాలా చోట్ల రావటం లేదు. ఇదే సమయంలో ఈ సినిమాలో చిరు రెమ్యునరేషన్‌పై కూడా పలు వార్తలు వచ్చాయి. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందేనని చిరంజీవి పట్టుబట్టడంతో ఆస్తులను అమ్మేందుకు భోళా శంకర్ నిర్మాత అనిల్ సుంకర సిద్ధమయ్యారని జోరుగా రూమర్లు వినిపించాయి. లేటెస్టుగా ఈ రూమర్లకు అనిల్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తమకు, చిరంజీవికి మధ్య వివాదం తలెత్తిందన్న పుకార్లలో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.
రూమర్లపై అనిల్ సుంకర్ స్పందిస్తూ.."ఈ రూమర్లు కొందరికి క్రూరమైన ఆనందాన్ని ఇవ్వొచ్చు. కానీ సుదీర్ఘ కాలం నుంచి ఎంతో కష్టపడి దక్కించుకున్న ప్రతిష్ఠను దెబ్బతీసేలా చేయడం ఆమోదయోగ్యం కానీ నేరం. ఈ విషయంలో ఇన్వాల్వ్ అయిన అన్ని కుటుంబాలపై తీవ్రమైన ఒత్తిడి, ఆందోళలను పెంచాయి. చిరంజీవి గారికి, నాకు మధ్య వివాదాలు వచ్చాయని వ్యాప్తిస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధం. ఆయన మాకు నిరంతరం చాలా మద్దతు ఇచ్చారు. ఆయన ఎప్పటిలాగానే నాతో చాలా బాగా ఉన్నారు" అని అనిల్ సుంకర ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవడంతో చిరు తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చాడనే ప్రచారం సైతం జోరుగా సాగుతుంది . భోళా శంకర్ కోసం చిరంజీవి 55 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే నిర్మాత ఇవ్వాల్సిన పేమెంట్ కొంత ఉండగా.. సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఇవ్వాల్సిన 10 కోట్ల చెక్‌ను చిరంజీవి తిరస్కరించారని లేటెస్టుగా టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఇక ఈ రెమ్యూనరేషన్ విషయంలో చిరంజీవి అంత డిమాండ్ చేశాడని.. ఇటీవల కొన్ని వార్తలు వైరల్ అవ్వగా అవన్ని ఫేక్ న్యూస్ అని తేలిపోయింది . చిరంజీవి మంచి మనిషి అని.. రెమ్యూనరేషన్ డిమాండ్ చేశాడనే వార్తల్లో నిజం లేదని అనిల్‌తో పాటు చిత్ర యూనిట్ కూడా క్లారిటీ ఇచ్చేసింది ..