Home > సినిమా > Mega 157 : బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో చిరు నెక్స్ట్ సినిమా

Mega 157 : బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో చిరు నెక్స్ట్ సినిమా

Mega 157 : బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో చిరు నెక్స్ట్ సినిమా
X

మెగాస్టార్ చిరంజీవి సినిమాలు అంటే ఒక రేంజ్ లో ఉంటాయి. సాధారణంగా ఉన్న సినిమాను కూడా హిట్ చేసేస్తారు ఫ్యాన్స్. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన భోళా శంకర్ ను మాత్రం ఫ్యాన్సే యాక్సెప్ట్ చేయలేదు. బాసు ఇలాంటి సినిమా చేయకుండా ఉండాల్సింది, డైరెక్టర్ అస్సలు పట్టించుకోలేదు అంటూ కామెంట్లు వచ్చాయి. దీంతో తన నెక్స్ట్ సినిమా దర్శకుడిని జాగ్రత్తగా ఎంచుకున్నారు చిరంజీవి. ఈసారి రీమేక్ కాకుండా డైరెక్ట్ సినిమా చేయనున్నారు బాసు.

ఈరోజు మెగాస్టార్ బర్త్ డే. 68 ఏళ్ళ వయసులో కూడా ఏ మాత్రం ఉత్సాహం తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు చిరు. భోళా శంకర్ ఫ్లాప్ అయినా మరో సినిమాతో ముందడుగు వేస్తున్నారు. నెక్స్ట్ మూవీతో మాత్రం పక్కా హిట్ కొట్టాలని భావిస్తున్నారు చిరు. అందుకే నందమూరి కళ్యాణ్ రామ్ తో హిట్ కొట్టిన డైరెక్టర్ వశిష్టతో తరువాతి మూవీకి రెడీ అవుతున్నారు. యూవీ క్రియేషన్స్ లో వస్తున్న ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. సోషియో ఫాంటసీగా ఈ సినిమా రాబోతోంది.

వశిష్ట మొదటి సినిమా కూడా సెమీ పీరియాడిక్ ఫాంటసీ డ్రామా. అది కూడా కల్యాణ్ రామ్ తో. ఎలా ఉంటుందో అంటూ డౌట్ పడ్డారు అందరూ. కానీ వశిష్ట బింబిసారతో పెద్ద హిట్ ఇచ్చారు. స్క్రిప్ట్ మీద ఉన్న కమాండ్తో తక్కువ బడ్జెట్ లోనే బ్లాక్ బస్టర్ తీసి చూపించారు. దీన్ని చూసే ఇప్పుడు మెగాస్టార్ తన నెక్ట్స్ సినిమా చేయాలని డిసైడ్ చేసుకున్నారు. ఈరోజు ఈవిషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కొత్త సినిమా కూడా సోషియో ఫాంటసీ సినిమానే అంటున్నారు మూవీ టీమ్.

చిరంజీవి తన కెరీర్ లో చేసిన సోషియో ఫాంటసీ మూవీ జగదేకవీరుడు-అతిలోక సుందరి. ఇప్పుడు మళ్ళీ తన 157 సినిమాను అదే కాన్సెప్ట్ లో చేయబోతున్నారు చిరు. జగదేకవీరుడు-అతిలోక సుందరి మూవీలో లానే ఇందులో కూడా కొందరు దేవకన్యలు భూమి మీదకు రావడం అనే కాన్సెప్ట్ తోనే రాబోతోందిట. ఇందులో చాలా మంది హీరోయిన్స్ ఉంటారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా పేరు, హీరోయిన్లు ఎవరు లాంటి విషయాలు మాత్రం ఇంకా కన్ఫార్మ్ కాలేదు. అయితే చిరు కొత్త సినిమాకు ముల్లోక వీరుడు అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు రూమర్స్ మాత్రం వినిపిస్తున్నాయి.


Updated : 22 Aug 2023 12:35 PM IST
Tags:    
Next Story
Share it
Top