మనవరాలిపై మోగాస్టార్ ట్వీట్..తాతయ్య అయినందుకు ఆనందంగా ఉంది
X
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. మెగా కుటుంబంలోకి మెగా వారసురాలు వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఇంట మూడో తరం అడుగుపెట్టింది. మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. దీంతో మెగా ఇంట సంబరాలు మిన్నంటాయి. ప్రస్తుతం తల్లీ , బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆస్పత్రి ప్రకటన విడుదల చేసింది. మెగా వారసురాలు పుట్టడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాత అయినందుకు మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని ట్విటర్ వేదికగా తెలియజేశారు. నీ రాకతో కోట్లాది మందికి ఆనందాన్ని అందించావు ఉంటూ మనవరాలిపై చిరు చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
"లిటిల్ ప్రిన్సెస్‌కు స్వాగతం.. నీ రాకతో కోట్లాది మంది మెగా అభిమానులకు సంతోషాన్ని అందించావు. రామ్ చరణ్, ఉపాసనలను అమ్మానాన్నలను చేశావు.. మమ్మల్ని గ్రాండ్ పేరంట్స్‌ను చేశావు. ఈ నిమిషం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది" అంటూ చిరు ట్వీట్ చేశారు.
Welcome Little Mega Princess !! ❤️❤️❤️
You have spread cheer among the
Mega Family of millions on your arrival as much as you have made the blessed parents @AlwaysRamCharan & @upasanakonidela and us grandparents, Happy and Proud!! 🤗😍
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2023
మంగళవారం తెల్లవారుజామున అపోల్ ఆస్పత్రిలో ఉపాసన పండండి పాపకు జన్మనిచ్చింది. దీంతో అభిమానులు అపోలో ఆస్పత్రికి చేరుకుని కేక్ కట్ చేసి రామ్ చరణ్ దంపతులకు, చిరంజీవి కుటుంబానికి శుభాకాంక్షలు చెబుతున్నారు. సినీ ప్రముఖులు మెగా వారసురాలికి గ్రాండ్గా స్వాగతం పలుకుతూ నెట్టింట్లో పోస్టులు పెడుతున్నారు. రామ్ చరణ్ దోస్త్ ఎన్టీఆర్ కూడా ట్విటర్లో దంపతులకు శుభాకాంక్షలు తెలిపాడు. అమ్మానాన్నలు అయినందుకు మీ ఇద్దరికీ అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. " కూతురితో గడిపే ప్రతి క్షణం మరుపురానిదిగా, మీ జీవితంలో ఓ జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఎప్పుడూ మీరు ఆనందంగా ఉండాలి. ఆ దేవుడిని అదే ప్రార్ధిస్తున్నాను" అని ఎన్టీఆర్ ట్విట్ చేశారు.మెగావారి కాబోయే కోడలు లావణ్య త్రిపాఠి తన ట్విటర్ అకౌంట్లో రామ్ చరణ్ దంపతులకు విషెస్ తెలిపింది.
Congratulations @AlwaysRamCharan and @upasanakonidela. Welcome to the parents club. Every moment spent with the baby girl will be an unforgettable memory for a life time. May God bless her and you all with immense happiness.
— Jr NTR (@tarak9999) June 20, 2023
Congratulations to this beautiful couple on the arrival of their little princess 💞
— LAVANYA (@Itslavanya) June 20, 2023
Your baby already has a head start on life with you both as her parents!
Wishing you and the little one all the love and happiness ❤️@AlwaysRamCharan @upasanakonidela