'భోళా శంకర్' సాంగ్ రిలీజ్...చిరంజీవీ డ్యాన్స్ కుమ్మేశాడు..
X
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న 'భోళా శంకర్' చిత్రం నుంచి మొదటి పాట రిలీజ్ అయ్యింది. "అదిరే స్టైలయ్యా, పగిలే స్వాగయ్యా, యుఫోరియా నా ఏరియా.. భోళా మేనియా" అంటూ మొదలయ్యే ఈ పాట అభిమానులను అలరిస్తోంది. మాస్ పాటకు మెగాస్టార్ చిరంజీవి తన మార్క్ డ్యాన్స్‌తో దుమ్ములేపారు. చిరు వేసిన గ్రేస్ స్టెప్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. కింద ఉన్న 'భోళా శంకర్' పాటపై మీరు కూడా ఓ లుక్కేయండి
వాల్తేరు వీరయ్య విజయంతో తర్వాత మరో మాస్ పాత్రలో చిరంజీవి రావడం సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. భోళా శంకర్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరో వైపు షాడో తర్వాత మెహర్ రమేష్.. మెగాస్టార్ మూవీకి దర్శకత్వం వహిస్తుండడం ఆసక్తి నెలకొంది.
'భోళా శంకర్' చిత్రం ‘వేదాళం’కి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. చిరుకి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా, చిరంజీవికి సిస్టర్ గా కీర్తి సురేష్ ఈ కనిపిస్తున్నారు. 'భోళా శంకర్'కు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ కుమారుడు మహతీ స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఆగస్టు 11వ తేదీన సినిమా విడుదల కానుంది.