Home > సినిమా > వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున టీజర్ రిలీజ్

వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున టీజర్ రిలీజ్

వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున టీజర్ రిలీజ్

వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున టీజర్ రిలీజ్
X



ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన సినిమా గాండీవ ధారి అర్జున. ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ అయింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో భారీ బడ్జట్ తో, హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. టీజర్ మొత్తం పుల్ యాక్షన్ తో నింపేశారు.

వన్ అండ్ హాఫ్ మినిట్ డ్యూరేషన్ తోనే టీజర్ ని కట్ చేసిన ప్రవీణ్ సత్తారు, ‘గాంఢీవధారి అర్జున’ కథ గురించి ఎలాంటి హింట్ ఇవ్వకుండా మేకింగ్ ని మాత్రమే చూపించే ప్రయత్నం చేసాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ స్పైగా కనిపిస్తున్నాడు. ఇన్నాళ్ళకు అతని పర్శనాలిటీకి తగ్గ క్యారెక్టర్ పడిందనిపించింది టీజర్ చూస్తుంటే. కిల్లింగ్ మిషన్ గా మెగాప్రిన్స్ కరెక్ట్ గా సరిపోయాడు. టీజర్ లో చూపించిన యాక్షన్ సీన్స్, స్టంట్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఏజెంట్ సినిమాతో డెబ్యూ చేసిన సాక్షి వైద్య హీరోయిన్ గా చేసింది. చాలారోజులుగా వరుణ్ ఖాతాలో ఒక్క హిట్ కూడా లేదు. ఈ సినిమాతో అయినా సక్సెస్ అందుకుంటాడో లేదో మరో నెల రోజుల్లో తెలిసిపోతుంది.


Updated : 24 July 2023 11:12 AM IST
Tags:    
Next Story
Share it
Top