Home > సినిమా > భోళా శంకర్ టీజర్ వచ్చేసింది...

భోళా శంకర్ టీజర్ వచ్చేసింది...

భోళా శంకర్ టీజర్ వచ్చేసింది...
X

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ టీజర్ వచ్చేసింది. శనివారం సాయంత్రం భోళా శంకర్ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మాస్ లుక్‌లో చిరంజీవి అదరగొట్టేశాడు. తెలంగాణ భాషలో చిరు క్యారెక్టర్ చేస్తున్నట్టు టీజర్ చూస్తే తెలుస్తోంది. చివర్లో స్టేట్ డివైడ్ అయినా అంతా నా వాళ్ళే అంటూ డైలాగ్ రచ్చలేపారు మెగాస్టార్. కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేసి..భోళా శంకర్ టీజర్‌ను చూసేయండి

డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో వహిస్తున్న భోళా శంకర్ చిత్రంలో మెగాస్టార్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. కీలక పాత్రలలో కీర్తి సురేష్, సుశాంత్ కనిపించనున్నారు. ఈ ఏడాది ఆగస్టు 11న భోళా శంకర్ విడుదల కానుంది.


Updated : 24 Jun 2023 6:56 PM IST
Tags:    
Next Story
Share it
Top