నాకెలాంటి క్యాన్సర్ రాలేదు.. అవాకులు చవాకులు రాయకండి
X
క్యాన్సర్ బారినపడినట్లుగా వచ్చిన వార్తలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. అవన్నీ అసత్యాలేనని.. తన మాటల్ని తప్పుగా అర్ధం చేసుకున్నారని చెప్పారు. తాను ఒకటి అంటే కొన్ని మీడియా సంస్థలు మరోలా రాశాయని అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ఇటువంటి అవాకులు,చవాకులు రాయొద్దంటూ సూచించారు. దీనికి సంబంధించి చిరు ఓ ట్వీట్ చేశారు
‘‘కొద్దిసేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్గా వుండి కొలోనోస్కోప్ టెస్ట్ చేయించుకున్నాను. అందులో non - cancerous polyps ని డిటెక్ట్ చేసి తీసేశారు అని చెప్పాను. అలా ముందుగా టెస్ట్ చేయించుకోకపోతే అది క్యాన్సర్ కింద మారేదేమో అని మాత్రమే అన్నాను. అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు చేయించుకోవాలి అని మాత్రమే అన్నాను’’ అని ట్వీట్ చేశారు.
‘‘అయితే కొన్ని మీడియా సంస్థలు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అవగాహనారాహిత్యంతో నేను క్యాన్సర్ బారినపడ్డాను, చికిత్స వల్ల బతికాను అని స్క్రోలింగ్లు, వెబ్ ఆర్టికల్స్ మొదలు పెట్టాయి. దీని వల్ల అనవసరమైన కన్ఫ్యూజన్ ఏర్పడింది. అనేకమంది వెల్ విషర్స్ నా ఆరోగ్యం గురించి మెసేజ్లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ క్లారిఫికేషన్. అలాగే అలాంటి జర్నలిస్టులకి ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు చవాకులు రాయకండి. దీనివల్ల అనేక మందిని భయభ్రాంతుల్ని చేసి బాధపెట్టిన వారవుతారు’’ అని మెగాస్టార్ ట్వీట్ చేశారు.
కొద్ది సేపటి క్రితం నేనొక క్యాన్సర్ సెంటర్ ని ప్రారంభించిన సందర్భంగా క్యాన్సర్ పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం గురించి మాట్లాడాను. రెగ్యులర్ గా మెడికల్ టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అని చెప్పాను. నేను అలర్ట్ గా వుండి కొలోన్ స్కోప్ టెస్ట్…
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 3, 2023
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.