Home > సినిమా > మీరేం చేయాలో అవి చేయండి, ప్రజలు వంగి నమస్కరిస్తారు

మీరేం చేయాలో అవి చేయండి, ప్రజలు వంగి నమస్కరిస్తారు

మీరేం చేయాలో అవి చేయండి, ప్రజలు వంగి నమస్కరిస్తారు
X

రాజకీయాల్లో ఘోరంగా దెబ్బతిన్నప్పటి నుంచి వాటికి దూరంగా ఉంటూనే వస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినా...ఎన్నికలంటూ తిరుగుతున్నా అటు వైపు తొంగి కూడా చూడ్డంలేదు. అంతేకాదు తాను అటువైపుకు వచ్చేది లేదంటూ పరోక్షంగా చెబుతూనే ఉన్నారు కూడా. ఇప్పుడు తాజాగా రాజకీయాలు, నాయకుల మీద ఘాటుగా విమర్శలు చేశారు.

వాల్తేరు వీరయ్య 2 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక సెలబ్రేషన్స్ నిర్వహించారు. మూవీ టీమ్ అంతా ఇందులో పాల్గొంది. చిరంజీవి కూడా ఈ వేడుకల్లో పార్టిసిపేట్ చేశారు. ఆ ఫంక్షన్లోనే సినీ పరిశ్రమను చుట్టుముటడుతున్న రాజకీయాల మీద మాట్లాడారు. రాజకీయాలు చేసేవాళ్ళు, అందులో ఉన్నవాళ్ళు ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి లాంటి వాటి గురించి ఆలోచించాలి. ఏం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందో దాని మీద దృష్టి పెట్టాలి. పేదవారి కడుపు నింపాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి మరీ నమస్కారం చేస్తారు. అంతే కానీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా అన్నింటికీ సినిమా వాళ్ళ మీద పడతారెందుకు అంటూ ఘాటుగా విమర్శించారు. సినీ పరిశ్రమ అంటే అంత చులకన ఎందుకంటూ ప్రశ్నించారు.

ఇక తన సినిమా సాధించిన సక్సెస్ గురించి కూడా మెగాస్టార్ మాట్లాడారు పూర్వం రోజులు మళ్ళీ వస్తున్నాయన్న ఫీలింగ్ కలిగిందని చెప్పారు చిరు. ఒకప్పుడు సినిమాలు 100, 175, 200 రోజులు ఆడేవి. ఇప్పుడు రెండు వారాలు ఆడితే చాలా గొప్ప అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాల్తేరు వీరయ్య 200 రోజులు ఆడడం చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పుకొచ్చారు. అత్యధిక రోజులు సినిమా ఆడి, దానికి గుర్తింపుగా షీల్డు అందుకుంటుంటే ఒళ్ళు పులకరిస్తోందని అన్నారు. చరిత్ర తిరగరాసినట్టు అనిపిస్తోందిన గర్వంగా చెప్పారు.

Updated : 8 Aug 2023 6:32 AM GMT
Tags:    
Next Story
Share it
Top