తమ్ముడిని ఇమిటేట్ చేసిన అన్నయ్య
X
60 ఏళ్ళ వయసులోనూ ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా యంగ్ హీరోలతో సమానంగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం భోళాశంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వస్తున్న చిరంజీవి సూపర్ ట్విస్ట్ ఇస్తున్నారు.
చిరు లీక్స్ అంటూ తన సినిమాల్లోని ఇంట్రస్టింగ్ విషయాలను, వ్యక్తిగత జీవితంలోని విషయాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటారు చిరంజీవి. మరికొన్ని రోజుల్లో ఆయన నటించిన భోళాశంకర్ సినిమా విడుదల అవబోతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు, పాటలు లాంటివి రిలీజ్ చేస్తూనే ఉన్నారు మూవీ టీమ్. ఇప్పడు చిరు లీక్స్ ద్వారా ఆయనే మరో ఇంట్రస్టింగ్ విషయాన్ని బయట పెట్టారు. పైగా దర్శకుడు మెహర్ రహేష్ కు ఆ విషయం తెలియదని...తమ్ముళ్ళు ఎవరూ చెప్పొద్దని అన్నారు కూడా. అదంతా పక్కన ఉంచితే చిరు లీక్ చేసిన వీడియో చూసి ఆయన అభిమానులంతా మాత్రం పిచ్చ హ్యాపీగా ఫీలవుతున్నారు.
భోళాశంకర్ సినిమాలో మెగాస్టార్ అభిమానులను డబుల్ ట్రీట్ ఇస్తున్నారు. ప్రతిసారీ పవర్ స్టార్ తన సినిమాల్లో చిరుని ఇమిటేట్ చేస్తుంటారు. చిరు డైలాగులను, డాన్స్ ను అనుకరిస్తూ ఉంటారు. కానీ ఈసారి దానికి రివర్స్ లో తమ్ముడినే అన్నయ్య అనుకరిస్తున్నారు. తమ్ముడు పవన్ కల్యాణ్ డైలాగ్,స్ మేనరిజమ్స్ ని భోళాశంకర్ లో చిరు ఇమ్మిటేట్ చేస్తున్నానని స్వయంగా చిరు లీక్స్ వీడియోలో గ్లింప్స్ చూపించారు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అని సినిమాలో ఇంకా ఉందని చెప్పారు. దీన్ని చూసిన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.