రెండు రోజులు ఆ సినిమా నన్ను వెంటాడింది-మెగాస్టార్
X
బేబీ సినిమా కుమ్మేస్తోంది. అటు కలెక్షన్ల పరంగా దుమ్ములపుతున్న ఈ కల్ట్ మూవీ...ఇటు ఇండస్ట్రీలోనూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయి కూర్చుంది. ఈ సినిమా నేంచి బయటపడ్డానికి మూడు రోజులు పట్టిందని స్వయంగా మెగాస్టార్ చిరంజీవే చెప్పారంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో.
బేబీ మూవీ టీమ్ నిర్వహించిన బేబీ మూవీ మెగా సెలబ్రేషన్స్ ఈవెంట్ కు చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. దర్శకుడు సాయి రాజేష్, ఎస్ ఎన్ కే లు చిరంజీవి మీద అభిమానం కురిపించేశారు. ఆయన వల్లే తామీ స్థాయిలో ఉన్నామని చెప్పుకొన్నారు. మరోవైపు మెగాస్టార్ కూడా బేబి సినిమాలను, నటులను పొగడ్తల్లో ముంచిపడేశారు. నేను బేబి సినిమా విజయోత్సవ సభకు వచ్చానా లేక నా సన్మాన సభకు వచ్చానా అర్థం కావడం లేదు. నన్ను అభిమానిస్తూ, ప్రేమిస్తూ వాళ్ల మనసులో మాటను నాకు చెబుతున్న నా అభిమానులందరికీ నా ధన్యవాదాలు చెబుతున్నాఅన్నారు చిరంజీవి . పుత్రోత్సాహం ఎలా ఉంటుందో అనుభవిస్తున్నాను, అలాగే తమ్ముళ్ళ అభివృద్ధిని చూసి ఆనందిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.
ఇక బేబీ మూవీలో లీడ్ క్యారెక్టర్లలో నటించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవిలను అయితే ఆకాశానికి ఎత్తేశారు మెగాస్టార్. ఆనంద్ లో ఇంత గొప్పనటుడు ఉన్నాడని తెలియదని చెప్పారు. ఒక సీన్ లో అతను పలికించిన భావోద్వేగాలు చూసి ఇంత బాగా ఆనంద్ నటించగలడా వావ్ అనిపించింది. ఎమోషనల్ సీన్స్ లో అతను పలికించిన హావభావాలు కేవలం ఫేస్ లోవి మాత్రమే కాదు హృదయంలో నుంచి వచ్చాయా అనిపించదని పొగిడేశారు. ఇక వైష్ణవి గురించి చెబుతూ సహజనటి జయసుధ తర్వాత మళ్ళీ ఈ అమ్మాయిలోనే అలాంటి నటనను చూశానని మెచ్చుకున్నారు. బస్తీ యువతి నుంచి గ్లామరస్ గా గర్ల్ గా ఆమె మారిన తీరు నిజంగా ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. అలాగగే విరాజ్ కూడా చాలా నటించాడని. చాలా అందంగా ఉన్నాడని సర్టిపికేట్ ఇచ్చారు.
ఈ సినిమాలో అందరూ మంచివాళ్లే. మంచివాళ్ళతోనే విలనిజాన్ని చూపించాడు దర్శకుడు సాయి రాజేష్. ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని చిరంజీవి అన్నారు.