Home > సినిమా > చిరంజీవికి సర్జరీ.. అసలు ఏం జరిగిందంటే..?

చిరంజీవికి సర్జరీ.. అసలు ఏం జరిగిందంటే..?

చిరంజీవికి సర్జరీ.. అసలు ఏం జరిగిందంటే..?
X

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో యంగ్ స్టార్స్కు గట్టి పోటీ ఇస్తున్నారు. రిజల్ట్తో సంబంధం లేకుండా ఆయన వరుస సినిమాలు చేస్తున్నారు. ఏడాదిన్నరలో ఆయన నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. జనవరిలో రిలీజైన వాల్తేర్ వీరయ్య సూపర్ విక్టరీ కొట్టగా.. ఇటీవల విడుదలైన భోళా శంకర్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ తమిళ వేదాళంకు రిమేక్గా తెరకెక్కగా.. మెహర్ రమేష్ డైరెక్ట్ చేశారు.

ప్రస్తుతం చిరు మోకాలి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. డాక్టర్లు సర్జరీ చేయించుకోవాలని సూచించడంతో ఆయన కూడా దానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ లేదా బెంగళూరులో సర్జరీ చేయించుకునే అవకాశం ఉంది. సర్జరీ తర్వాత నెలన్నర పాటు ఆయన రెస్ట్ తీసుకోనున్నారు. ఆ తర్వాత ఆయన కొత్త సినిమాలపై ఫోకస్ పెడతారని సమాచారం.

భోళాశంకర్ తర్వాత చిరు నెక్స్ట్ ప్రాజెక్ట్పై ఆసక్తి నెలకొంది. అగస్ట్ 22న మెగాస్టార్ బర్త్ డే.. ఆ రోజు ఆయన తర్వాత సినిమాపై ఏదైన అప్ డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక భోళా శంకర్ మూవీపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఇది అవుట్ డేటెడ్ మూవీ అని.. పదేళ్ల క్రితం రావాల్సిన సినిమా.. ఇప్పుడు చేశారని రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

Updated : 14 Aug 2023 11:16 AM IST
Tags:    
Next Story
Share it
Top