Home > సినిమా > ANRCentenary Celebrations : తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన ఉంటారు..చిరంజీవి

ANRCentenary Celebrations : తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన ఉంటారు..చిరంజీవి

ANRCentenary Celebrations : తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన ఉంటారు..చిరంజీవి
X

టాలీవుడ్ దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమయ్యాయి. అక్కినేని కుటుంబ సభ్యులు, ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు, ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామిక రంగాలకు చెందిన వారు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా అన్నపూర్ణ స్టూడియోస్‎లో మహానటుడి విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఏఎన్నార్‌ను గుర్తుచేసుకుంటూ ట్విటర్ వేదికగా ఓ ట్వీట్‌ చేశారు. అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి ఆయనకు నివాళులు అర్పించారు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

" శత జయంతి ఉత్సవాల సందర్భంగా మహానటుడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆప్యాయంగా, గౌరవపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాను. ఆయన తెలుగు సినిమాకే కాదు.. భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు. ఆయన ఎన్నో వందల సినిమాల్లో నటించారు.. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తెలుగు సినిమా ఉన్నంత వరకు ఆయన ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. ఆ మహానటుడి శతజయంతి సందర్భంగా అక్కినేని ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరికీ, నా సోదరుడు నాగార్జునకు, నాగేశ్వరరావు ఆరాధించే కోట్లాది మంది అభిమానులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు" అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. ANRCentenary celebrations





Updated : 20 Sept 2023 11:33 AM IST
Tags:    
Next Story
Share it
Top