Home > సినిమా > చిరంజీవి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే...

చిరంజీవి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే...

చిరంజీవి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే...
X

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్. భాక్సాఫీస్ వద్ద భోళా శంకర్ బోల్తా పడింది. చిరు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. భోళాశంకర్ విడుదల తర్వాత చిరంజీవి

హెల్త్ చెకప్ కోసం ఢిల్లీ వెళ్లారు. మోకాలిలో తరచూ నొప్పి రావటంతో పరీక్షలు చేయించుకున్నారు. వివిధ పరీక్షలు చేసిన వైద్యులు..చిరంజీవి మొకాలి ఆపరేషన్ చేయాలని చెప్పారు. దీంతో రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఓ ప్రముఖ ప్రయివేటు ఆస్పత్రిలో మెగాస్టార్ మోకాలి ఆపరేషన్ పూర్తైంది. చిరంజీవికి ఎలాంటి కోత లేకుండా ఆర్థ్రోస్కోపిక్ విధానంలో ఢిల్లీ వైద్యులు ఇన్ఫెక్షన్ తొలగించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఢిల్లీలోనే మెగాస్టార్ విశ్రాంతి తీసుకుంటున్నారు. వారం రోజుల తర్వాత ఆయన హైదరాబాద్ రానున్నట్లు సమాచారం. ఆగస్ట్ 22న అంటే ఆయన పుట్టిన రోజున కొత్త సినిమా ప్రారంభోత్సవంలోనూ చిరంజీవి పాల్గొంటారు. ఈ చిత్రానికి బంగ్రాజు ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.





చిరంజీవికి అమెరికా ట్రిప్ లో ఉన్నప్పుడు మోకాలికి స్వల్పంగా గాయం అయింది. మొదట్లో అక్కడే చేయించుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఆయన సర్జరీ ఢిల్లీలో జరిగింది. గతంలో భుజానికి సంబంధించిన సమస్యలతో బాధపడిన ఆయన.. ఇప్పుడు మోకాలు సమస్యతో బాధపడుతుండటంతో మోగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక చిరంజీవి రీమేక్ చిత్రాలు తీయడంపై కూడా అభిమానులు ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


Updated : 16 Aug 2023 3:54 PM IST
Tags:    
Next Story
Share it
Top