Home > సినిమా > కేసీఆర్ను పరామర్శించిన చిరంజీవి

కేసీఆర్ను పరామర్శించిన చిరంజీవి

కేసీఆర్ను పరామర్శించిన చిరంజీవి
X

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పరామర్శల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి యశోద ఆస్పత్రిలో కేసీఆర్ను పరామర్శించారు. కేటీఆర్, కవితలను అడిగి ఆయన ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరు.. కేసీఆర్ హుషారుగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్‌ 6 వారాల్లో కోలుకోవచ్చని వైద్యులు చెప్పారన్నారు. కేసీఆర్‌ త్వరగా కోలుకుని సాధారణ జీవితం ప్రారంభించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సినిమాలు ఎలా ఆడుతున్నాయి.. సినీ పరిశ్రమ ఎలా ఉందని కేసీఆర్ అడగడం సంతోషం కలిగించిందన్నారు.

అంతకుముందు టీడీపీ అధినేత చంద్రబాబు కేసీఆర్ను పరామార్శించారు. కేసీఆర్ ఆరోగ్య వివరాలను ఆయన తనయుడు కేటీఆర్, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్కు విజయవంతంగా తుంటి ఆపరేషన్ జరిగిందని చెప్పారు. కేసీఆర్ త్వరగా కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నటుడు ప్రకాశ్ రాజ్ దంపతులు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, మాజీ మంత్రులు మల్లారెడ్డి, గంగుల కమలాకర్ యశోదా ఆసుపత్రికి వచ్చి కేసీఆర్ను పరామర్శించారు.


Updated : 11 Dec 2023 8:24 PM IST
Tags:    
Next Story
Share it
Top